టాలీవుడ్ చందమామ.. కాజల్ అగర్వాల్ తాజాగా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సరికొత్త ఏడాది శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను పంచుకున్నారు. వెండితెరపై తన నటనతో కోట్లాది మంది మనసులు గెలుచుకున్న ఈ స్టార్ హీరోయిన్, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను మరియు ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. ఈ కొత్త ఏడాది తనకెంతో ప్రత్యేకమని, అందరి జీవితాల్లోనూ సంతోషం నిండాలని ఆమె కోరుకుంటుంది. కాజల్ షేర్ చేసిన ఈ పోస్ట్ లో తన ఫోటులు చాలా హాట్ గా ఉండటంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read : Naveen Chandra : భయానక ప్రపంచంలోకి తీసుకెళ్లిన నవీన్ చంద్ర ‘హనీ’ గ్లింప్స్
పెళ్లయి, ఒక బిడ్డకు తల్లైన తర్వాత కూడా తన గ్లామర్‌ను ఏమాత్రం తగ్గకుండా కాపాడుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ప్రజంట్ ఆమె రాబోయే సినిమాల కోసం తామంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని పేర్కొంటున్నారు. ప్రస్తుతం కాజల్ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. హిందీలో ప్రతిష్టాత్మక ‘రామాయణ’ చిత్రంలో నటిస్తున్న ఆమె, తమిళ్లో ‘గరుడ’తో పాటు తెలుగు, కన్నడ భాషల్లోనూ కొత్త సినిమాలకు సంతకం చేశారు. చూడబోతే దాదాపు అన్ని దక్షిణాది భాషలను కవర్ చేస్తూ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు కాజల్.