Kajal Aggarwal : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .ఈ భామ టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది.స్టార్ హీరోయిన్ గా కెరీర్ ఫుల్ స్వింగ్ లో వున్న సమయంలోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుంది.తాజాగా ఈ భామ హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.గత ఏడాది బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది.ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఇదిలా ఉంటే కాజల్ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ “సత్యభామ”.ఈ సినిమా మే నెలాఖరున రిలీజ్ కానుంది.
కాజల్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎంతో బిజీగా వుంది.సత్యభామ మూవీ ప్రమోషన్ లో భాగంగా కాజల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.పెళ్ళికి ముందు నేను శంకర్ గారి దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమాకు సైన్ చేశాను.కొన్నాళ్ళకు ఆ సినిమా మళ్ళీ మొదలు కావడంతో నాకు బాబు పుట్టిన తర్వాత రెండు నెలల్లోనే ఆ సినిమా కోసం నేను హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను. అప్పుడు ఎంతో భాధను అనుభవించాను.కానీ ఆ భాధను తట్టుకొని ఎంతగానో కష్టపడ్డాను. ఆ సినిమాను నేను వద్దు అనుకుంటే చిత్ర యూనిట్ వేరే వాళ్ళని తీసుకుంటారు. కాని నేను ఆ సినిమాను చేయాలి అని అనుకున్నాను. శంకర్ సర్ షూటింగ్ సమయంలో నాకు ఎంతో సపోర్ట్ చేసారని కాజల్ తెలిపింది.ఆ సినిమా కోసం హార్స్ రైడింగ్ చాల కష్టంగా వున్నా ఎంతో ఇష్టపడి చేసాను అని కాజల్ తెలిపింది.