కాజల్ అగర్వాల్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయినా ఈ భామ తన నటనతో బాగా ఆకట్టుకుంది. ఆ తరువాత కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ సినిమాలో నటించింది. ఆ సినిమాలో తన క్యూట్ లుక్స్ కి అందరూ ఫిదా అయ్యారు.ఆ తరువాత మగధీర చిత్రంలో కాజల్ చేసిన మిత్రవింద పాత్ర ఎంతగానో ఫేమస్ అయింది. మగధీర ఇండస్ట్రీ హిట్ కొట్టగా కాజల్ కి వరుస స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చాయి..అలా దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కాజల్. తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన గౌతమ్ కిచ్లు ని 2020 అక్టోబర్ లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది.గత ఏడాది ఏప్రిల్ లో ఈ జంటకు ఒక బాబు కూడా పుట్టాడు. కాజల్ తన బాబుకి నీల్ కిచ్లు అని పేరు కూడా పెట్టింది. ఇక రీసెంట్ గా వరుస సినిమాలలో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా మొదలు పెట్టింది కాజల్. ఇప్పటికే కాజల్ రెండు భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది.వివాదాలతో ఆగిపోయిన ఇండియన్ 2 మళ్ళీ మొదలయింది.ఇండియన్ 2 మేకర్స్ దర్శకుడు శంకర్ తో కాంప్రమైజ్ అవ్వడం జరిగింది.దీంతో శంకర్ శరవేగంగా ఇండియన్ 2 సినిమాను పూర్తి చేస్తున్నారు. ఇంకా 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని సమాచారం. కాజల్ తన కెరీర్ లో మొదటిసారి విశ్వనటుడు కమల్ హాసన్ సరసన నటిస్తున్నారు.. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇండియన్ 2 తో పాటు కాజల్ నట సింహం బాలకృష్ణ సరసన హీరోయిన్ గా భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. భగవంత్ కేసరి షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం.. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కు కూతురుగా నటిస్తుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కాజల్ పాత్ర కూడా ఈ సినిమాలో అదిరిపోతుందని సమాచారం.ఇదిలా ఉంటే కాజల్ సినిమా షూటింగ్స్ కొద్దిగా బ్రేక్ ఇచ్చిన భర్త తో ట్రిప్ కి వెళ్ళింది.. ప్రస్తుతం కాజల్ టర్కీ దేశంలో ఉన్నారు. అందమైన ప్రదేశాల్లో భర్త గౌతమ్ కిచ్లుతో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. తాజాగా అక్కడ తన భర్తతో దిగిన రొమాంటిక్ పిక్ ను షేర్ చేసింది ఈ భామ.ఫ్యాన్స్ ఈ పిక్స్ లైక్స్ మరియు కామెంట్స్ చేస్తున్నారు.