Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న డిమాండ్‌పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ కార్యాలయం నుండి అధికారికంగా నోటీసులు జారీ అయ్యాయి.
Rakul Preet Singh: డబ్బులిచ్చి మరీ బురద చల్లుతున్నారు.. పీఆర్ పై నిప్పులు చెరిగిన రకుల్
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో విచారణకు హాజరు కావాలని కడియం శ్రీహరికి నోటీసులు పంపారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు వస్తుందని, కావున ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పీకర్‌కు పిటిషన్ సమర్పించారు. ఈ విచారణకు పిటిషన్ దారుడైన కేపీ వివేకానందకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.
రేపు జరగబోయే ఈ విచారణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విచారణకు ఇరు పక్షాలకు సంబంధించిన న్యాయవాదులు హాజరు కావాలని స్పీకర్ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. కడియం శ్రీహరి తరపున , బీఆర్ఎస్ పార్టీ తరపున న్యాయవాదులు స్పీకర్ ముందు తమ వాదనలను వినిపించనున్నారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలను స్పీకర్ పరిశీలించి, తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.
రాష్ట్రంలో కేవలం కడియం శ్రీహరి మాత్రమే కాకుండా, మరికొంత మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కూడా స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించిన విచారణ కూడా జరుగుతోందని, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయంలో జడ్జిమెంట్ రావాల్సి ఉందని సమాచారం. వీరందరిపై విచారణ పూర్తి చేసి, స్పీకర్ ఒకేసారి తుది నిర్ణయం లేదా జడ్జిమెంట్‌ను వెలువరించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై ఇటువంటి పిటిషన్లు ఉండగా, ఇప్పటికే ఏడుగురికి సంబంధించిన ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలుస్తోంది.
Maharashtra: మంత్రి పంకజ ముండేకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా..!
