అక్టోబర్ నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని… నవంబర్ లో ఎన్నికలు జరుగుతాయని అన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని కేతపల్లి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న ఆయన ఈ విధంగా కామెంట్ చేశారు.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని… రాష్ట్రానికి నిధులు విడుదల విషయంలో వివక్ష చూపుతుందని, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా శ్రీ కడియం ఫైర్ ఆయ్యారు… కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వచ్చే ఐదు నెలల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి మూడోసారి కేసీఆర్ ను సీఎం చేయాలని కడియం ఆయన అన్నారు.
Also Read : Pawan Kalyan Live:జనసేన, బీజేపీ లక్ష్యం జగన్ ఓటమే
అంతేకాకుండా.. మంగళవారం మునుగోడు నియోజకవర్గ ముఖ్య నాయకులతో చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనాల సన్నాహక సమావేశాన్ని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో కడియం శ్రీహరి కలిసి నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవడం ఈ సమ్మేళనాల ముఖ్య ఉద్దేశం ఉన్నారు.మోడీ వైఖరి ప్రజలకు తెలియ చేస్తూ సవతి తల్లి ప్రేమ, వివక్ష,అభివృద్ధిని అడ్డుకుంటున్న తీరును ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంలో సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు.5 గ్రామాలకు ఒక క్లస్టర్, 5 వార్డ్ లకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి 2 నుంచి 3 వేల మంది పాల్గొనేలా రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు.తెలంగాణలో 9 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి ఇతర రాష్ట్రంలో ఎందుకు జరగడంలేదో ఆలోచించుకోవాలని ఆయన అన్నారు.
Also Read : Pushpa 2: బన్నీ ఫ్యాన్స్ అసెంబుల్.. అప్డేట్ రావడమే ఆలస్యం రచ్చ చేయడమే