టీఆర్ఎస్ ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమైన సందర్భంగా కడియం శ్రీహరి మట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలపారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుంది తెలంగాణ అని ఆయన చెప్పారు. టీఆర్‌ఎస్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. అన్ని ప్రాం తాలు, అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ చిత్త శుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో చిత్తశుద్ధితో పనిచేస్తామని వెల్లడించారు.…
కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తామని హెచ్చరించడంతో సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుందని… మోదీది రైతు వ్యతిరేక, దళిత వ్యతిరేక ప్రభుత్వం, ఆదానీ, అంబానీల ప్రభుత్వం అని నిప్పులు చెరిగారు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి. ఏడేళ్ల కాలంలో భారతదేశ జీడీపీ తగ్గితే… తెలంగాణ జీఎస్టీపీ పెరిగిందని… భారతదేశానికి ఎక్కువ ఆదాయం ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని తెలిపారు. రైతుల విషయంలో అన్నీ బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుని రైతులకు శఠగోపం పడుతోందని…. బడా పారిశ్రామిక…
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వరంగల్‌లో తీన్మార్ మోగిస్తుంది. కారు పార్టీ పుల్ జోష్ మీదుంది. ముగ్గురు నేతలను ఒకేసారి ఎంపిక చేయడం మంత్రి పదవులు సైతం దక్కే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో కారు పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైనా ఉమ్మడి వరం గల్ జిల్లాకు చెందిన బండా ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కడి యం శ్రీహరి పేర్లను కేసీఆర్ ప్రకటించిన విషయం తెల్సిందే.. రాజకీ య అనుభవం,…
సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో లంచ్ వేదిక మార్పు వెనక కథేంటి? సీఎం ఇచ్చిన సంకేతాలు వెళ్లాల్సిన వారి చెంతకు వెళ్లాయా? ఓరుగల్లు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన అంశాలేంటి? కడియం శ్రీహరి ఇంట్లో సీఎం కేసీఆర్ విందు! సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ అనగానే గుర్తొచ్చేది రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసం. 20 ఏళ్ల క్రితం ఉద్యమ సమయంలోను.. ఇప్పుడు సీఎం హోదాలో వరంగల్ వస్తే హంటర్ రోడ్డులోని కెప్టెన్ ఇంట్లో కేసీఆర్ దిగాల్సిందే.…
టీఆర్‌ఎస్‌లోని ఆ సీనియర్ నేతకు మళ్లీ పదవీయోగం ఉందా? ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం దక్కించుకుంటారా? ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థులపై ఆయన ఫైర్ కావడం వెనక కారణం అదేనా? ఎమ్మెల్సీ పదవిపై అధిష్ఠానం హామీ దక్కిందా లేదా? కడియం శ్రీహరికి మరోసారి ఎమ్మెల్సీ ఇస్తారా? తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఆరు ఖాళీ అయ్యాయి. షెడ్యులు ప్రకారం ఇదే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ…