Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Kadapa Police Encounter Accused In Khajipet Girl Murder Shot While Trying To Escape

Kadapa Police Encounter: ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు..

Published Date :April 11, 2026 , 10:27 am
By Sudhakar Ravula
Kadapa Police Encounter: ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kadapa Police Encounter: కడప జిల్లా ఖాజీపేటలో సంచలనంగా మారిన బాలిక హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలికను గొంతు కోసి హత్య చేసిన నిందితుడు వెంకటేష్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడిని పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో పారిపోయేందుకు యత్నించడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.. సమాచారం ప్రకారం, మైదుకూరు నుంచి నిందితుడిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో బసాపురం చెక్‌పోస్ట్‌ వద్ద వెంకటేష్‌ పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులపై దాడి చేయడంతో, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో నిందితుడి కాలికి గాయాలు కాగా, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

పోలీసులకు గాయాలు
నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో ఇద్దరు పోలీసులకు కూడా గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే మైదుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, బహిరంగ ఉరిశిక్ష అమలు చేయాలని లేదా అతడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు హైవేపై భారీగా ధర్నా నిర్వహించారు.

సీఎం చంద్రబాబు స్పందన
ఇక, బాలిక గొంతు కోసి చంపిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. మహిళలు, బాలికలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను, అధికారులను సూచించారు. మొత్తంగా బాలిక హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపగా, నిందితుడిపై జరిగిన పోలీసుల కాల్పులు మరింత చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh Crime News
  • AP police action
  • Basapuram check post news
  • girl murder case India
  • Kadapa encounter news

తాజావార్తలు

  • Kadapa Police Encounter: ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు..

  • Mangli: మంగ్లీపై 10 కోట్ల చీటింగ్ కేసు.. అసలు ఏం జరిగిందంటే?

  • Islamabad: ఇరాన్-అమెరికా చర్చల వేళ ఇస్లామాబాద్‌లో హై-టెన్షన్.. భారీగా కమాండోలు మోహరింపు

  • Mani Ratnam: మణిరత్నం.. విజయ్ సేతుపతి-సాయి పల్లవి కాంబో మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

  • Modi-Rahul Gandhi: పార్లమెంట్ దగ్గర మోడీ-రాహుల్‌గాంధీ సంభాషణ.. వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions