పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 ఏడీ”. బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రాన్ని 2024 మే 9 న విడుదల చేయాలనీ మేకర్స్ భావించారు.. కానీ ఈ మూవీ మరో తేదీన విడుదల కాబోతుందంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి..తాజాగా కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్‌పై కొత్త అప్‌డేట్ బాగా వైరల్ అవుతుంది.ఈ చిత్రాన్ని జులై 12న విడుదల చేయనున్నట్లు ఓ వార్త హల్ చల్ అవుతుంది.అయితే ఈ మూవీ విడుదల తేదీపై మేకర్స్ నుంచి అధికారిక అప్‌డేట్ వస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు..”కల్కి 2898 AD “ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వనీదత్ భారీగా నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే మరియు దిశా పటానీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్ మరియి పశుపతి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం నుండి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ టైటిల్, గ్లింప్స్ వీడియో కి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి..గతంలో విడుదల చేసిన కల్కి 2898 ఏడీ రైడర్స్ (యూనిఫార్మ్‌డ్ విలన్ ఆర్మీ) కాస్ట్యూమ్స్ మేకింగ్ మరియు అసెంబ్లింగ్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేసాయి.నాగ్ అశ్విన్ టీం కొన్ని రోజుల క్రితం ఇటలీలోని సర్దినియా ఐలాండ్‌లో ప్రభాస్ మరియు దిశాపటానీపై వచ్చే పాటను చిత్రీకరించిన విషయం తెలిసిందే…ఇప్పటికే సలార్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ప్రభాస్ కల్కి మూవీతో తిరుగులేని విజయం అందుకోనున్నట్లు ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు.