Justice Dhiraj Singh Thakur sworn: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు.. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్.. కొత్త సీజేతో ప్రమాణం చేయించారు. ఇక, ఈ కార్యక్రమానికి శాసనమండలి సీఎం వైఎస్ జగన్‌తో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానమ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్‌రెడ్డి, పలువులు న్యాయమూర్తులు, ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, ఇతర ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారోత్సవం అనంతరం గవర్నర్, సీఎం వైఎస్ జగన్ కొత్త సీజేను సన్మానించి అభినందనలు తెలిపారు. హై టీ సమయంలో సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కు అభినందనలు తెలిపిన చంద్రబాబు.. శాలువాతో సన్మానించారు.
Read Also: Zyber365: కేవలం 3 నెలల్లో 9840 కోట్ల విలువైన కంపెనీ.. హ్యాట్సాఫ్ గురూ
కాగా, జమ్మూకశ్మీర్‌కు చెందిన జస్టిస్ ధీరజ్‌సింగ్‌ది న్యాయమూర్తుల కుటుంబం. ఆయన తండ్రి, సోదరుడు కూడా న్యాయమూర్తులుగా పనిచేసినవారే.. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తీర్థసింగ్ ఠాకూర్ సోదరుడే జస్టిస్ ధీరజ్‌సింగ్ కావడం విశేషంగా చెప్పుకోవాలి.. న్యాయవర్గాల్లో అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడిగా, సమర్థుడిగా జస్టిస్ ధీరజ్ సింగ్‌కు పేరుపొందారు.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన 2026 ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు..