Jubilee Hills By Election: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం (ECI) అధికారిక నోటిఫికేషన్ను నేడు (అక్టోబర్ 13) విడుదల చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి కారణంగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానాన్ని గెలుచుకోవాలని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఇది ప్రతిష్టాత్మక పోరుగా మారింది. ఇందుకోసం పార్టీలు ఇప్పటికే ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి.
నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి, నోటిఫికేషన్ విడుదల నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 21 వరకు సమర్పించవచ్చు. ఈ వ్యవధిలో ప్రభుత్వ సెలవు దినాలను మినహాయించి మిగిలిన అన్ని రోజుల్లో నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల సమర్పణ స్థలం షేక్ పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేశారు రిటర్నింగ్ ఆఫీస్.
Astrology: అక్టోబర్ 13, సోమవారం దినఫలాలు.. ఏ రాశి వారు ఏం చేయాలంటే..?
ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 22న సమర్పించిన పత్రాల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 24గా నిర్ణయించారు. అదే రోజు సాయంత్రం ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ నవంబర్ 11గా నిర్ణయించబడింది. పోలింగ్ అనంతరం, నవంబర్ 14న యూసఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల కౌంటింగ్ నిర్వహించి తుది ఫలితాలను ప్రకటించడం జరుగుతుంది.
Shetty Balija Scholarships: పాలకొల్లులో నన్ను గెలిపించింది బీసీలు, ఎస్సీలే: మంత్రి నిమ్మల
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,98,982 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,07,367 మంది పురుషులు, 1,91,590 మంది మహిళలు, 25 మంది ఇతరులు ఉన్నారు. వివిధ ఓటరు వర్గాల సంఖ్యను బట్టి, ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడానికి పార్టీలు ప్రతి ఓటరు సమూహాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ఎన్నికల వ్యూహాలను రూపొందిస్తున్నాయి.