Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక, అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఉదయం 6.45 గంటలకి మాక్ పోలింగ్ నిర్వహించారు.
Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థిగా మాగంటి సునీత అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఆమె తన నామపత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్ దేదీప్యతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. BC Leaders Fight: బీసీ సంఘాల ప్రతినిధులు మధ్య తోపులాట.. చెయ్యి చేసుకున్న…
Jubilee Hills by-poll: రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లా పరిధిలో గల జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 13 (సోమవారం)న గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో మొదలైంది. నామినేషన్లను స్వీకరించడానికి చివరి తేదీ అక్టోబర్ 21 (మంగళవారం)గా నిర్ణయించింది ఈసీ. అలాగే నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22 (బుధవారం)న జరుగుతుంది. అభ్యర్థిత్వం ఉపసంహరణకు చివరి తేదీగా అక్టోబర్ 24 (శుక్రవారం)గా నిర్ణయించారు. ఇక పోలింగ్ నవంబర్…
Jubilee Hills By Election: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం (ECI) అధికారిక నోటిఫికేషన్ను నేడు (అక్టోబర్ 13) విడుదల చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి కారణంగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానాన్ని గెలుచుకోవాలని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఇది ప్రతిష్టాత్మక పోరుగా మారింది. ఇందుకోసం పార్టీలు ఇప్పటికే ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియకు…