ఈ మధ్యన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎన్నడు లేనంత లీన్ లుక్‌లో తారక్ కనిపించడంతో.. ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. మరి ఇంత సన్నగా అయ్యాడేంటి? అనుకున్నారు. కానీ ప్రశాంత్ నీల్ సినిమా కోసం కొత్తగా మేకోవర్ అవుతున్నాడు టైగర్. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో భారీ గడ్డంతో కనిపించబోతున్నాడు. అయితే ఈ మధ్య డ్రాగన్ గురించి పలు రూమర్స్ వచ్చాయి. ఇప్పటి వరకు వచ్చిన అవుట్ ఎన్టీఆర్‌కు నచ్చలేదని అన్నారు. కానీ ఫైనల్‌గా స్క్రిప్ట్‌లో చిన్న చిన్న మార్పులు చేసి నెక్స్ట్ షెడ్యూల్‌కి సిద్ధమవుతున్నారు ఎన్టీఆర్-నీల్.
ఇప్పటికే హైదరాబాద్, కర్ణాటకలో కొంత మేర షూట్ చేసిన టీమ్.. ఈసారి విదేశాల్లో ప్లాన్ చేశారు. త్వరలోనే యూరప్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ టీమ్ లొకేషన్ రెక్కీలో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ ఒకటి బయటికొచ్చింది. ఈసారి మరింత భారీ గడ్డంతో దర్శనమిచ్చాడు తారక్. ఫిజిక్ పరంగా పెద్దగా చేంజెస్ కనిపించలేదు కానీ.. రగ్డ్ లుక్‌లో కేక పెట్టించేలా ఉన్నాడు టైగర్. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుండగా అలా స్టైలిష్‌గా నడుచుకుంటూ.. కెమెరా వైపు చూస్తు.. స్మైల్ ఇస్తూ మీసం తిప్పుతు కనిపించాడు. దీంతో ప్రజెంట్ ఈ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Also Read: AP News: ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మెరుపు దాడులు.. పరారైన డాక్యుమెంట్ రైటర్లు!
ఇంత గుబురు గడ్డంతో ఎన్టీఆర్‌ను ఇప్పటి వరకు చూడలేదనే చెప్పాలి. అయితే ఎన్టీఆర్ స్మైల్ చూస్తుంటే మాత్రం డ్రాగన్ విషయంలో ఫుల్ హ్యాపీ అన్నట్టుగా ఉన్నాడు. అలాగే ప్రచారంలో ఉన్న రూమర్స్‌కు ఇలా మీసం తిప్పి చిరునవ్వుతో సమాధానం చెప్పినట్టుగా ఉందనే చెప్పాలి. మరి ఇలాంటి లుక్‌తో ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.
Man of masses #JrNTR 🔥💥🔥😎 pic.twitter.com/omPgwQmJlS
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) November 5, 2025