Jail Love Story: జైల్లో ఖైదీల మధ్య ప్రేమ.. వివాహం చేసుకోవడానికి 15 రోజుల పెరోల్ మంజూరు చేసిన కోర్టు
- రాజస్థాన్ జైలులో మొదలైన ప్రేమకథ ఇప్పుడు పెళ్లి దశకు చేరుకుంటోంది
- ప్రియా సేథ్, హనుమాన్ ప్రసాద్ ఇద్దరూ వేర్వేరు హత్యలకు జైలు పాలయ్యారు
- హంతకులు ప్రియా సేథ్, హనుమాన్ ప్రసాద్ పెళ్లి చేసుకోనున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాళ్లిద్దరు వేర్వేరు హత్యల్లో దోషులు. ఓ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ కాస్త పెళ్లికి దారితీసింది. వారు వివాహం చేసుకోవడానికి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది కోర్టు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. రాజస్థాన్ జైలులో మొదలైన ప్రేమకథ ఇప్పుడు పెళ్లి దశకు చేరుకుంటోంది. ప్రియా సేథ్, హనుమాన్ ప్రసాద్ ఇద్దరూ వేర్వేరు హత్యలకు జైలు పాలయ్యారు. ప్రియ, హనుమాన్ ప్రసాద్ జైపూర్‌లోని సంగనేర్ ఓపెన్ జైలులో కలుసుకున్నారు. ప్రేమలో పడ్డారు. ఇప్పుడు రాజస్థాన్ హైకోర్టు అల్వార్‌లోని బరోడమేవ్‌లో వివాహం చేసుకోవడానికి 15 రోజుల అత్యవసర పెరోల్ మంజూరు చేసింది. ప్రియ, హనుమాన్ ప్రసాద్ ఈరోజు, శుక్రవారం, జనవరి 23న వివాహం చేసుకోనున్నారు.
Also Read:US-Canada: అమెరికా-కెనడా మధ్య ఉద్రిక్తతలు.. బోర్డ్ ఆఫ్ పీస్ ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్న ట్రంప్
Also Read
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
ఐదుగురిని హత్య చేసిన కేసులో హనుమాన్ ప్రసాద్ జైలులో ఉన్నాడు. అతను నలుగురు పిల్లలను, ఒక యువకుడిని చంపాడు. హనీట్రాప్ చేసి దుష్యంత్ శర్మ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో ప్రియ సేథ్ (33) యావజ్జీవ శిక్ష అనుభవిస్తోంది. ఐదుగురిని హత్య చేసిన కేసులో హనుమాన్ ప్రసాద్ జైపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతను తన స్నేహితురాలితో కలిసి ఆమె భర్త బన్వారీ లాల్‌ను హత్య చేశాడు. హత్యలు జరిగిన ఇంట్లో ప్రసాద్ ముగ్గురు పిల్లలు మరియు మేనల్లుడు కూడా ఉన్నారు. అరెస్టుకు భయపడి, ప్రసాద్ ఆమె ఆదేశం మేరకు, నలుగురు పిల్లలను కత్తితో చంపాడు. 2018లో జరిగిన హత్య కేసులో ప్రియా సేథ్ దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తోంది.
Also Read:Jr NTR : నారా లోకేష్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే విషెష్
గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న వీరు గతేడాది నవంబర్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, తమ కుటుంబాలకు తెలిపారు. డిసెంబర్‌లో పెరోల్ కోసం రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యర్థనలో భాగంగా కోర్టుకు పెళ్లి పత్రికను కూడా సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు జిల్లా పెరోల్ సలహా కమిటీ వీరికి పెళ్లి కోసం పెరోల్ మంజూరు చేసింది. హంతకుల మధ్య ప్రేమ పెళ్లి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!