నార్నె నితిన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా ఆయ్. గీతా ఆర్ట్స్ 2బ్యానర్ పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 15న రిలీజ్ కానుంది ఆయ్. ఈ సినిమాలోని నటుడు నార్నె నితిన్ ను ఆయన బావ జూనియర్ ఎన్టీయార్ ట్విట్టర్ వేదికగా ‘ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఈరోజు వరకు ఈ సినిమా పట్ల నీలో ఉన్న ఉత్సాహాన్ని చూస్తూనే ఉన్నాను. సిల్వర్ స్క్రీన్ పై నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నాను. రేపు రిలీజ్ కాబోతున్న’ఆయ్’ చిత్ర టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు అని తెలిపారు.
Also Read: DoubleISMART; డబుల్ ఇస్మార్ట్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏంటంటే..?
ఇక మరోవైపు తారక్ హీరోగా నతిస్తున్న పాన్ ఇండియా సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్ స్టార్ట్ చేసే పనిలో ఉంది నిర్మాణ సంస్థ. ఇందులో భాగంగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎక్కడ నిర్వహించాలి అనే దానిపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. మొదటి కర్నూలు లో అనుకున్నారని, కానీ ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నారని, ఈవెంట్ ను విజయవాడలో నిర్వహించబొతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: CommitteeKurrollu: అదరగొడుతున్న కమిటీ కుర్రోళ్ళు 5 రోజుల కలక్షన్స్ ఎంతంటే..?
దేవర సినిమా షూటింగ్ ను తారక్ ముగించాడు. అటు బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ -2 షూటింగ్ కూడా వీలైనంత ఫాస్ట్ గా ఫినిష్ చేసే ఆలోచన చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈలోగానే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయబోయే పాన్ ఇండియా సినిమాను అక్టోబరు నుండి స్టార్ట్ చేయాలనీ భావిస్తున్నాడు ఎన్టీయార్. ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్టు ఇది వరకే ప్రకటించారు మేకర్స్