Jani Master : ఇటీవల కాలంలో మీడియాలో ఒకటే హాట్ టాపిక్. అదే జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం. తెలుగు సహా తమిళ, హిందీ సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇటీవల ఆయన చేసిన ఒక తమిళ సినిమాలో పాటకు గాను జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా వరించింది .ఆ ఉత్తమ అవార్డు ఇంకా తీసుకోక ముందే ఆయన తనను లైంగికంగా వేధిస్తున్నాడని పలుసార్లు రేప్ చేశాడు అంటూ ఆయన వద్ద గతంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముందు ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఆమె నివాసం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి అక్కడికి జీరో ఎఫ్ఐఆర్ అంటూ పోలీసులు ట్రాన్స్ ఫర్ చేశారు.
Read Also:Maharashtra CM: ఈ నెల 26న మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం..
లేడీ కొరియోగ్రాఫర్ దాఖలు చేసిన కేసులో కొన్ని రోజుల పాటు చంచల్ గూడ జైల్లో గడిపిన జానీకి ఇటీవల తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్, వారి కుటుంబ సభ్యులు బాధితురాలిని బెదిరింపులకు పాల్పడవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆమె పని చేసే వద్దకు వెళ్లి ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత అక్టోబర్ 25న జైలు నుంచి బయటకొచ్చిన జానీ మాస్టర్.. ఇప్పుడు కుటుంబ సభ్యులతో గడపుతున్నారు. వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు.
Read Also:Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
జానీ మాస్టర్ కు తాజాగా మరో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్టోబరు 24న హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయడానికి నిరాకరించింది. ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రతో కూడిన ధర్మాసనం జానీ మాస్టర్ బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ ను డిస్మిస్ చేసింది. తాము తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని క్లారిటీ ఇచ్చింది. అలా జానీ మాస్టర్ కు బిగ్ రిలీఫ్ దక్కినట్లు అయింది.