Maoists Surrender : జార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- జార్ఖండ్‌లో ఒకేసారి 27 మంది మావోయిస్టుల లొంగుబాటు
- ‘ఆపరేషన్ నవజీవన్’తో పోలీసులకు భారీ విజయం
- సబ్-జోనల్, ఏరియా కమాండర్లు సహా కీలక నేతల సరెండర్
- LMGలు, INSAS రైఫిళ్లు, 3 వేల తూటాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists Surrender : జార్ఖండ్ రాష్ట్రంలో నక్సలైట్ల నెట్‌వర్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో మావోయిస్టుల అణిచివేతే లక్ష్యంగా సాగుతున్న ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా గురువారం (మే 21, 2026) ఒకేసారి 27 మంది మావోయిస్టులు రాంచీలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి, పోలీసులకు వీరంతా తమ ఆయుధాలను అప్పగించారు.
రాష్ట్ర ప్రభుత్వం, రక్షక దళాలు సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ నవజీవన్’ ఈ చారిత్రాత్మక లొంగుబాటుకు ప్రధాన కారణమైంది. లొంగిపోయిన వారిలో 25 మంది నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) సంస్థకు చెందిన వారు కాగా, మరో ఇద్దరు జేజేఎంపీ (JJMP) గ్రూప్‌నకు చెందిన సభ్యులు. ఈ ఆపరేషన్ ద్వారా మావోయిస్టు సానుభూతిపరులలో, క్షేత్రస్థాయి క్యాడర్లో మార్పు తీసుకురావడంలో పోలీసులు పూర్తి విజయం సాధించారు.
Also Read
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- Off The Record : తెలంగాణ రియల్ఎస్టేట్ రంగంలో ఊహించని కుదుపు
లొంగిపోయిన వారిలో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న హైలెవెల్ లీడర్లు ఉండటం గమనార్హం. మొత్తం 27 మందిలో ఏడుగురు సబ్-జోనల్ కమాండర్లు, ఆరుగురు ఏరియా కమాండర్లు ఉన్నారు. ముఖ్యంగా దాదాపు 123 హింసాత్మక కేసుల్లో మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉండి, సుదీర్ఘకాలంగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న మావోయిస్ట్ అగ్రనేత సాగెన్ అంగారియా కూడా లొంగిపోయిన వారిలో ఉన్నారు.
పోలీసుల ఎదుట మోకాళ్లూనిన మావోయిస్టులు తమ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధ సంపత్తిని, మందుగుండు సామగ్రిని భద్రతా దళాలకు అప్పగించారు. ఇందులో భారీ నష్టాన్ని కలిగించే లైట్ మెషిన్ గన్స్ (LMGs), ఇన్సాస్ (INSAS) రైఫిళ్లు, ఎస్ఎల్ఆర్ గన్లతో పాటు దాదాపు 3,000 కు పైగా లైవ్ తూటాలు (Ammunition) ఉన్నాయి. వీటన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ భారీ లొంగుబాటుతో జార్ఖండ్‌లోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన సరాండా , కోల్హాన్ అడవుల్లో మావోయిస్టుల బలం పూర్తిగా క్షీణించిందని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఒకప్పుడు ఈ ప్రాంతాలను శాసించిన మావోయిస్ట్ దళాలలో ఇప్పుడు కేవలం 16 నుండి 17 మంది సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే ఆ ప్రాంతాన్ని పూర్తి నక్సల్ రహిత జోన్‌గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
చట్టాన్ని గౌరవించి లొంగిపోయిన ఈ 27 మంది అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి పునరావాస (Rehabilitation) సౌకర్యాలు కల్పిస్తామని జార్ఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. లొంగుబాటు విధానం ప్రకారం వారికి రావాల్సిన ఆర్థిక సాయం, ఉపాధి అవకాశాలు , వారి పిల్లల చదువుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని, మిగిలిన వారు కూడా ఆయుధాలు వీడి సమాజంలో కలవాలని అధికారులు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Maoists Surrender : జార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్‌మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!