నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈరోజు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (JEE మెయిన్) 2023, సెషన్ 1 ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో ఫలితాన్ని చూసుకోవచ్చు. జేఈఈ మెయిన్ 2023 ఫైనల్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఫిబ్రవరి 6న విడుదల చేయబడింది. జనవరి 24, 25, 28, 29, 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీల్లో పరీక్షలు నిర్వహించబడ్డాయి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2023 మొదటి సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఇప్పుడు jeemain.nta.nic.inలో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అయితే.. అప్లికేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీతో జేఈఈ మొయిన్ సెషన్ 1 ఫలితాలు చూసుకోవచ్చు.
Also Read : Superstition: తల్లిదండ్రులా.. రాక్షసులా.. 3 నెలల పసిపాపను కాల్చడానికి మనసేలా వచ్చిందిరా
ఇంజనీరింగ్ పేపర్‌లో మొత్తం 20 మంది అభ్యర్థులు 100 శాతం మార్కులు సాధించారు. అందులో 14 మంది జనరల్ కేటగిరీ, నలుగురు OBC-NCL, మరియు gen-EWS మరియు SC కేటగిరీ నుండి ఒక్కొక్కరు ఉన్నారు. 99.99 పర్సంటైల్ సాధించిన బాలికలు ఇద్దరు ఉన్నారు. అయితే.. జేఈఈ మెయిన్‌కి సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీ కూడా ఇవ్వబడింది. ఈ సారి మొత్తం 8.6 లక్షల మంది అభ్యర్థులు పేపర్ 1, 46 వేల మంది అభ్యర్థులు పేపర్ 2 పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ పేపర్‌కు మొత్తం 95.79 శాతం హాజరయ్యారు. అయితే.. నేషనల్ టెస్టింగ్ ఏజేన్సీ (NTA) ప్రవేశ పరీక్షను నిర్వహించడం ప్రారంభించినప్పటి నుండి ఇది అత్యధికం. జేఈఈ మెయిన్ ఫైనల్ ఆన్సర్ కీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు అధికారులు.
Also Read : Natasha Perianayagam: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా భారతీయ-అమెరికన్