Superstition: ప్రపంచం రోజుకో రంగు పులుముకుంటుంది.. గ్రహాల మీదకు వెళ్లి స్థలాలను కూడా కొనుక్కోవడం మొదలుపెట్టేశారు ప్రజలు.. కానీ, కొంతమంది మాత్ర, ఎక్కడ పుట్టారో అక్కడే ఆగిపోతున్నారు. విద్యా, వైద్యం అందుబాటులో ఉన్నా కట్టుబాట్లు, సంప్రదాయాల పేరుతో కన్నవారిని,కట్టుకున్నవారిని బలి తీసుకుంటున్నారు. మూఢ నమ్మకాలను నమ్ముతూ ప్రేమించినవారికి దూరం చేసుకుంటున్నారు. తాజాగా ఒక జంట తమ సొంత బిడ్డను మూఢ నమ్మకాల బారిన పడేసింది. 3 నెలల పసిపాపను 51 సార్లు కాల్చి చంపేశారు. ఈ దారుణం మధ్యప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Shraddha Walkar Case: శ్రద్ధ హత్య కేసు ఛార్జిషీట్ లో సంచలన విషయాలు.. ఎముకలను పౌడర్ చేసే యత్నం
మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో గిరిజనుల తెగ ఒకటి ఉంది. ఇక్కడ ఉండేవారు అంతా గిరిజనులే. వారికి విద్యా, వైద్యం తెలియదు. ఈ తెగకు కొద్దీ దూరంలోనే హాస్పిటల్ కూడా ఉంది. అయితే వారు తమ కట్టబాట్లను వదిలి బాహ్య ప్రపంచంలోకి రామని తెగేసి చెప్పేశారు. ఇక ఈ తెగలో నివసించే ఒక గిరిజన జంటకు 3 నెలల క్రితం ఆడబిడ్డ పుట్టింది. అయితే ఆ బిడ్డకు పుట్టినప్పటి నుంచి ఊపిరి తిత్తుల సమస్య ఉండడంతో ఆమె న్యుమోనియాతో బాధపడుతుంది. మూడు నెలల నుంచి జలుబు, దగ్గు, ఏడుపు ఆపకపోవడం లాంటి చిన్నారితో కనిపించాయి. ఇక ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వారి తెగలో వేడి రాడ్ తో చిన్నారి శరీరంపై కాలిస్తే తగ్గిపోతుందని నమ్మకం. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పసిపాప శరీరంపై 51 సార్లు వేడి రాడ్ తో కాల్చారు. ఆ వేడికి తట్టుకొలేని చిన్నారి స్పృహ కోల్పోయింది. వెంటనే చిన్నారిని పక్కనే ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లి చూపించగా 15 రోజులు మృత్యువుతో పోరాడుతూ మరణించింది. వెంటనే గిరిజనులు ఆ చిన్నారిశవాన్ని పాతిపెట్టేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న శిశు సంక్షేమ అధికారులు గిరిజన తెగకు వెళ్లి చిన్నారి శవాన్ని వెలికి తీసి కేసు నమోదు చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు అభ్యర్ధించారు.