నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ సెషన్ 2 – 2024 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో జరుగుతుంది. ఇందులో భాగంగా జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులను తాజాగా విడుదల చేసారు. విద్యార్థులు jeemain.nta.ac.in వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డును సులువుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇక అభ్యర్థులు డౌన్ లోడ్ చేసేటప్పుడు అడ్మిట్ కార్డులో బార్ కోడ్ అందుబాటులో ఉందొ లేదు కచ్చితంగా నిర్ధరించుకోవాలి.
Also read: kendriya vidyalaya: కేవీల్లో ప్రవేశాలకు మొదలైన దరఖాస్తులు.. ఎవరు అప్లై చేసుకోవచ్చంటే..?!
అభ్యర్థులు ఈ స్టెప్స్ని పాటించి వారి అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా jeemain.nta.ac.in వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఆపై హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న సెషన్ 2 కోసం జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ 2024 పై క్లిక్ చేయాలి. దాంతో మనకి ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థుల వివరాలను నింపాల్సి ఉంటుంది. ఆపై అక్కడిసబ్మీట్ బటన్ క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇక తర్వాతి అవసరాల కోసం అడ్మిట్ కార్డు హార్డ్ కాపీని తీసి పెట్టుకోవాలి.
Also read: Fire Accident: రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లో అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
ఇక ఈ విషయంలో జేఈఈ మెయిన్స్- 2024 సెషన్ 2 అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. 011-40759000 నెంబరుకు కాల్ లేదా jeemain@nta.ac.in ఈ-మెయిల్ కి మెయిల్ చేయాలి. ఇక జేఈఈ మెయిన్స్ సెషన్-2 పరీక్షను 2024.. ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో పేపర్-1 కు, 2024 ఏప్రిల్ 12న పేపర్ 2ఏ (బీఆర్క్), పేపర్ 2బీ (బీ ప్లానింగ్), పేపర్ 2ఏ అండ్ 2బీ (బీ ఆర్క్, బీ ప్లానింగ్ రెండింటికీ) కు పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1 పరీక్షను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టులో నిర్వహిచబోతుంది ఎన్టీఏ.