వైసీపీ ఒకవైపు టీడీపీ- జనసేన- బీజేపీ మరోవైపు పోటీ పడుతున్నాయని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఏపీలో రెడ్లకు కమ్మ – కాపుల మధ్య పోరాటం అనే చర్చ జరుగుతోంది.. మంచి పాలన అంటే కేవలం సంక్షేమం అని ఒక పార్టీ భావిస్తోంది.. అప్పులు తెచ్చి సగం జీత భత్యాలకు, మరికొంత కైంకర్యం చేసి, కొంత దుబారా చేసి, మిగిలాగా సంక్షేమానికి పెడుతున్నారు అని ఆయన ఆరోపించారు. దేశ సమాజంలో సంక్షేమం అవసరమే కానీ.. దానికి పరిమితం ఉండాలి కదా అని ప్రశ్నించారు. కేవలం సంక్షేమమే పరిపాలన అనుకుంటే.. ఆ దేశం, రాష్ట్రం నాశనం అవ్వడం ఖాయం అన్నారు. మనకి ఇప్పుడు నడుస్తుంటే కాదు.. మన పిల్లల భవిష్యత్ ఏంటి అని అందరూ ఆలోచించాలి అని జయప్రకాశ్ నారాయణ చెప్పారు.
Read Also: PM Modi: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి ప్రధాని మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?
సంక్షేమం అంటేనే.. వ్యక్తిగతమైన తాత్కాలిక ప్రయోజనాలు అని జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ది పైనే ప్రధానంగా పోరాటం సాగుతుంది.. భవిష్యత్ తరాలకు మంచి చేసేవారు, ఉపాధి అవకాశాలు చూపే వారికే పట్టం కట్టండి అని పిలుపునిచ్చారు. ఏపీని కులాల క్షేత్రంగా మార్చకండని మొత్తుకుంటున్నా.. ఎవరూ వినడం లేదు అని పేర్కొన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ లో తన మద్దతు ఎన్డీఏ కూటమికేనని తెలిపారు. ఇక, రేపటి నుంచి తనపై కులముద్ర వేస్తారని తెలుసు.. అయినా రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వ్యాఖ్యనించారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ వెల్లడించారు.