వైసీపీ ఒకవైపు టీడీపీ- జనసేన- బీజేపీ మరోవైపు పోటీ పడుతున్నాయని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఏపీలో రెడ్లకు కమ్మ - కాపుల మధ్య పోరాటం అనే చర్చ జరుగుతోంది.. మంచి పాలన అంటే కేవలం సంక్షేమం అని ఒక పార్టీ భావిస్తోంది.
విజయవాడలో మూడు దారులు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాశ్ నారాయణ, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, దేవులపల్లి అమర్, ఆర్.వి.రామారావు పాల్గొన్నారు. రాజకీయ రంగాన భిన్న దృశ్యాలు అంశంతో దేవులపల్లి అమర్ పుస్తకం రచించారు.
రాష్ట్రంలో ఓటర్ల తొలగింపుపై 'ఓట్ ఇండియా - సేవ్ డెమోక్రసీ' పేరుతో లోక్‌సత్తా ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. విజయనగరంలోని మయూరా హోటల్ కాన్ఫిరెన్స్ హాల్‌లో పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ పోస్టర్ ఆవిష్కరించారు.