Jawahar Nagar: జంట హత్యకేసులో ప్రేమికులు అరెస్ట్
- జవహర్ నగర్‌లో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు
- మిస్టరీను ఛేదించిన పోలీసులు
- తన అక్క, తల్లిని హత్య చేసినట్లు ఒప్పుకున్న ప్రేయసి లక్ష్మి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jawahar Nagar: హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు మిస్టరీను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులుగా లక్ష్మి, ఆమె ప్రియుడు అరవింద్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ప్రేమ వివాహానికి అడ్డుగా మారుతున్నారని భావించి లక్ష్మి తన సొంత అక్క, తల్లిని హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ప్రియుడుతో కలిసి అమానుష చర్య:
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
బీహార్‌కు చెందిన అరవింద్ కుమార్‌తో ప్రేమలో ఉన్న లక్ష్మి, అతనితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆమె తన అక్క జ్ఞానేశ్వరి దగ్గర చెప్పగా, ఆమె తీవ్రంగా మందలించిందని పోలీసులు తెలిపారు. దీంతో లక్ష్మి ప్రియుడితో కలిసి తన అక్కను హత్య చేసి, మృతదేహాన్ని మూటగట్టిపట్టి సంపులో పడేసింది.
Read Also: WPL 2025 Final: బెంగళూరు చేతిలో ముంబై ఓటమి.. డబ్ల్యూపీఎల్ ఫైనల్‌కు ఢిల్లీ!
తల్లిని కూడా హత్య:
అక్క కనిపించకుండా పోవడంతో లక్ష్మిని నిలదీసింది ఆమె తల్లి సుశీల. ఆ తర్వాత తల్లికి కూడా తన ప్రేమ వివాహం గురించి చెప్పింది లక్ష్మి. అయితే, అరవింద్‌తో పెళ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తల్లి మందలించడంతో ఆమెను కూడా హత్య చేసింది.
నాటకీయంగా దోపిడీగా మలిచిన లక్ష్మి:
తల్లిని హత్య చేసిన అనంతరం లక్ష్మి, అరవింద్ కలిసి ఆమె వద్ద ఉన్న నగలు దోచుకున్నారు. అనంతరం ఈ ఘటనను దోపిడీ దొంగలు చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. కానీ, లక్ష్మి కదలికలు అనుమానాస్పదంగా మారడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు.
Read Also: Producers : ఇద్దరు నిర్మాతలు పోటాపోటిగా స్టేట్మెంట్స్.. గెలుపెవరిదో
పోలీసుల విచారణ:
పోలీసుల విచారణలో లక్ష్మి తన అక్క, తల్లిని ప్రేమ వివాహానికి అడ్డుగా ఉన్నారనే కారణంతోనే హత్య చేసిందని ఒప్పుకుంది. ఈ ఘటనలో ఆమెతో పాటు అరవింద్ కుమార్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటన జవహర్ నగర్‌లో తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాలతో తల్లి, అక్కను హత్య చేయడం అందరిని నివ్వెరపరిచేలా చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించి న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!