Jasprit Bumrah: నిన్న(బుధవారం) ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా అలవోకగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అందులో టీమిండియా స్టార్ బౌలర్ 4 వికెట్లు తీసి ఆఫ్ఘాన్ స్కోరును కట్టడి చేయగా.. ఇక బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే తన బౌలింగ్ లో 4 వికెట్లు సాధించినా.. సంతోషంగా లేనని బుమ్రా చెప్పుకొచ్చాడు. అతను వేసిన 10 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి నలుగురు ఆటగాళ్లను ఔట్ చేశాడు. తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేనని.. భారత్-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ తర్వాత జస్ప్రీత్ బుమ్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
Read Also: TPGL 2023: తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్.. పూర్తి ఆధిపత్యం చూపిన MYK స్ట్రైకర్స్
అంతేకాకుండా.. మ్యాచ్ రిజల్ట్ గురించి పెద్దగా పట్టించుకోనని జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. తన ప్రిపరేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపాడు. వికెట్‌కు అనుగుణంగా తన బౌలింగ్‌ను మార్చుకోవాలని చెప్పాడు. తాను బాగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తానని.. మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందో పట్టించుకోనని అన్నాడు. మరోవైపు అన్ని జట్లకు అద్భుతమైన బ్యాటింగ్‌తో పాటు మంచి బౌలింగ్ ఉందని జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. టీమిండియాలో కూడా అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారని.. బౌలర్లు కూడా అద్భుతంగా ఉన్నారని చెప్పాడు. తాము ఇతర జట్ల కంటే తమ జట్టుపై ఎక్కువ దృష్టి పెడతామన్నాడు. మనలోని లోటుపాట్లను సరిదిద్దుకుంటే మార్గం సులభతరం అవుతుందని చెప్పుకొచ్చాడు.
Read Also: Pakistan: పాక్ ఆటగాళ్లకు ఘనస్వాగతం పలకడంపై మండిపడుతున్న టీమిండియా అభిమానులు