AUS vs IND: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. కెప్టెన్ బుమ్రా ఓటు ఆ ఇద్దరికే! తుది జట్టు ఇదే
- మరో రెండు రోజుల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆరంభం
- పెర్త్ వేదికగా తొలి టెస్ట్
- ఓపెనర్‌గా కేఎల్ రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియా, భారత్ టీమ్స్ పెర్త్ వేదికగా తొలి టెస్ట్ ఆడనున్నాయి. కుమారుడు పుట్టిన కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. రోహిత్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టును నడిపించనున్నాడు. మొదటి టెస్టులో ఆడే తుది జట్టుపై బుమ్రా ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాడని తెలుస్తోంది.
రోహిత్ శర్మ జట్టుకు అందుబాటులో లేకపోవడంతో యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా ఆడనున్నాడని తెలుస్తోంది. దాంతో అభిమన్యు ఈశ్వరన్‌కు నిరాశ తప్పదు. వన్ డౌన్‌లో గిల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ఆడనున్నాడు. విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఆడతాడు. రిషబ్ పంత్ ఐదులో ఆడనుండగా.. ధ్రువ్ జురెల్‌ను ఆరో స్థానంలో బరిలోకి దిగుతాడని ప్రచారం సాగుతోంది. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి అరంగేట్రం దాదాపు ఖాయమే. పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులో ఉండనున్నాడు. ఆస్ట్రేలియా-ఏతో పాటు ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్‌లో నితీశ్ మెరుగైన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.
Also Read
విదేశాల్లో స్పిన్నర్ అనగానే బ్యాటింగ్ చేయగల రవీంద్ర జడేజా వైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపేది. కానీ ఆస్ట్రేలియాపై అద్భుతమైన రికార్డు కలిగిన ఆర్ అశ్విన్‌ను తీసుకోవావడానికి కెప్టెన్ బుమ్రా మొగ్గుచూపిస్తునట్లు తెలుస్తోంది. బౌన్సీ పిచ్‌లపై అశ్విన్ మరింత ప్రమాదకరం అనే ఉద్దేశంతో బుమ్రా ఉన్నాడట. ఇక పేస్ విభాగంలో తనతో పాటు ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్‌లను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట.
Also Read: Viral Video: ఇదేం ఫీల్డింగ్‌రా అయ్యా.. కిందపడి నవ్వుకున్న పంత్, కోహ్లీ!
తుది జట్టు (అంచనా):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (కీపర్), ధ్రువ్ జురెల్, నితీశ్ రెడ్డి, ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు