Janhvi Kapoor: వ్యూస్ కోసం మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుందో, అంతే స్థాయిలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై నెగిటివిటీ కూడా పెరిగిపోయింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ, టాలీవుడ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. తన సోదరుడు అర్జున్ కపూర్ గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన ట్రోలింగ్‌కు గురవుతున్న నేపథ్యంలో, జాన్వీ ఒక ఇంటర్వ్యూలో తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Also Read : NBK111: బాలకృష్ణ-గోపీచంద్ మలినేనిమూవీలో.. మంచు హీరో సెన్సేషనల్ ఎంట్రీ!
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్‌కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
జాన్వీ మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో వైరల్ అవ్వాలని అనుకుంటుంన్నారు. ఈ క్రమంలో వారు సెలబ్రిటీల గురించి కంటెంట్‌ను సృష్టిస్తున్నారు, కేవలం వారి వ్యూస్ కోసం మమ్మల్ని ‘బలిపశువు’ చేస్తున్నారు. మా పేరును వాడుకుని కేవలం క్లిక్స్ వ్యూస్ పొందాలనుకుంటారు తప్ప, అందులో నిజం ఎంత ఉందో అనవసరం. అసలు ఆ వార్తలకు మాకు ఎలాంటి సంబంధం లేదని తెలిసినా కూడా వారు కావాలనే నెగిటివిటీని ప్రచారం చేస్తారు’ అని ఆమె పేర్కొన్నారు. అలాగే
తన సోదరుడు అర్జున్ కపూర్‌పై వస్తున్న అభ్యంతరకరమైన కామెంట్స్ గురించి మాట్లాడుతూ.. ‘మనుషులు మన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. కానీ, సోషల్ మీడియాలో జరిగే ఈ రకమైన వేధింపులను అస్సలు క్షమించాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిని మనం మనసుకి దగ్గరగా తీసుకోకూడదు. వాటి గురించి ఆలోచిస్తూ ఎక్కువ సమయం వృధా చేయడం కంటే, ఆ నెగిటివిటీకి మనల్ని మనం ఎంత దూరంగా ఉంచుకుంటే అంత మేలు’ అని జాన్వీ హితవు పలికారు. ప్రజంట్ జాన్వీ మాటలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్‌గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!