Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక నటిస్తోంది. ఇప్పటికే పుష్ప తో ఐకాన్ స్టార్ గా మారిన బన్నీ.. పుష్ప 2 తో గ్లోబల్ స్టార్ గా మారడానికి ట్రై చేస్తున్నాడు. ఇక ఈ మధ్యకాలంలో బన్నీ బయట కనిపించడం లేదు. ఉంటే పుష్ప 2 షూటింగ్.. లేకపోతే కుటుంబంతో వెకేషన్ లో కనిపిస్తున్నాడు. ఇక తాజాగా బన్నీ.. తెలుగు ఇండియన్ ఐడల్ లో మెరిశాడు. ఆహా లో ప్రసారం అవుతున్న టాప్ సింగింగ్ షో. ఈ షో ఫైనల్ లో బన్నీ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. అతిరథ సంగీత విద్వాంసుల మధ్య బన్నీ ఫైనల్ ఎపిసోడ్ కు జడ్జిగా వచ్చాడు. ఇక తాజాగా బన్నీ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.
Urvashi Rautela: ఏంటీ.. ఆ బల్లి నెక్లెస్ అన్ని కోట్లా.. ఒక పాన్ ఇండియా సినిమా తీయొచ్చు తెలుసా..?
పుష్ప 2 ఫస్ట్ గ్లింప్స్ మ్యూజిక్ తో డ్యాన్సర్ ల మధ్య నుంచి బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో పుష్ప రాయల్ ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం ఇలాంటి సింగింగ్ షోకు జడ్జిగా రావడం తన అదృష్టమని చెప్పాడు. ఫైనల్ కంటెస్టెంట్స్ కు అల్ ది బెస్ట్ చెప్పుకొచ్చాడు. ఇక వారి పాటలు వింటుంటే.. తనకు కాళ్లు ఆగడం లేదని, డ్యాన్స్ చేయాలనిపిస్తోందని తెలిపాడు. కానీ, ఒక జడ్జీ స్థానంలో వచ్చాను కాబట్టి ఆ పెద్దరికం తనను ఆపేస్తుందని, అందుకే డ్యాన్స్ చేయాలనే తన కోరికను ఆపేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక చివరగా ఫైనల్ కంటెస్టెంట్ కు బన్నీ ట్రోఫీని బహుకరించినట్లు చూపించారు. ఆహా లో జరిగే ఈవెంట్ అనే కాదు.. బన్నీ ఏ ఈవెంట్ కు గెస్ట్ గా పిలిచినా వారిని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు వెనుకాడడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.