NTV Telugu Site icon

YSRCP: జనసేనకు బిగ్‌షాక్‌.. వైసీపీలో చేరిన జనసేన కీలక నేతలు

Ysrcp

Ysrcp

YSRCP: ఏపీలో జనసేన పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జి సందీప్‌ రాయల్‌తో పాటు రాయలసీమ రీజియన్‌ ఇంఛార్జి పద్మావతి పసుపులేటిలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సజ్జల రామకృష్ణారెడ్డి. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

Also Read: CM KCR: కొడంగల్ అభివృద్ధి బాధ్యత నాది.. ఎన్ని నిధులైనా ఇస్తా

పవన్ కళ్యాణ్ మభ్యపెడతాడని, పవన్ కళ్యాణ్‌ను నమ్ముకుని ఢిల్లీ లీడర్ కావాలనుకున్న నేను గల్లీకి కూడా కాకుండా పోయానని మాజీ జనసేన నేత పసుపులేటి సందీప్ రాయల్ అన్నారు. పసుపులేటి సందీప్ రాయల్ మాట్లాడుతూ.. “పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక మహిళ మాట మీద నన్ను మా అమ్మను పవన్ కళ్యాణ్ రోడ్డుకీడ్చాడు. నాదెండ్ల మనోహర్‌కు చిత్తశుద్ధి లేదు. పవన్ కళ్యాణ్‌కి రుక్మిణి అంటే భయం. పవన్ కళ్యాణ్ అహంకారి.. తను లేకుండా నాదెండ్ల కూడా అసెంబ్లీకి వెళ్ళకూడదనుకుంటాడు. హైదరాబాద్‌లో భూకబ్జా లో ఏ1గా ఉన్న వ్యక్తిని కమిటీలో పెట్టాడు పవన్. టీడీపీ కోసమే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడు. పవన్ ఏపీ రాజకీయాల్లో మాట తప్పాడు. పవన్‌ను ప్రజలు ఓడించినా ఎందుకు పోటీ చేస్తాడు. టీడీపీ పంచన చేరి మమ్మల్ని మోసం చేశాడు పవన్. కాపులు కావాలనుకుంటే పవన్ ముందు పెద్దన్న పాత్ర వహించాలి. నన్ను చదువు మాన్పించి, సివిల్స్ కోచింగ్ ఆపించి జనసేనలో చేర్చాడు. పవన్ సొంత అవసరాల కోసం నన్ను ఉద్యోగంలో పెట్టుకున్నాడు. పాతంశెట్టి సూర్యచంద్ర పార్టీ కోసం పనిచేస్తే పవన్ కలవను కూడా కలవలేదు.. జగన్ పెట్టిన కార్యక్రమాలకు ఆకర్షితులయ్యి వైసీపీలో చేరాం’ అని పసుపులేటి సందీప్‌ రాయల్ అన్నారు.

Also Read: GVL Narasimha Rao: కమ్యూనిష్టులు దాదాపు కనుమరుగయ్యారు.. సీపీఐ, సీపీఎంలు పిట్ట పార్టీలు

మాజీ జనసేన రాయలసీమ కన్వీనర్ పద్మావతి మాట్లాడుతూ.. “2009 నుంచి చిరంజీవి అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చా. 2014లో జనసేనకు అండగా నిలబడింది పసుపులేటి పద్మావతి అనే నేను.. పవన్‌ను నమ్మి నా బిడ్డను ఆయన దగ్గరకు పంపితే చాలా గొప్ప బహుమతి ఇచ్చారు. పవన్ ను నమ్మి యువతను ఎవ్వరూ పవన్ వద్దకు పంపద్దు అని ఒక తల్లిగా కోరుతున్నా..పవన్ మాట తప్పి మమ్మల్ని బయటకు పంపేసాడు.. నాదెండ్ల మనోహర్ మహిళలను ఎదగనివ్వకుండా తొక్కేసాడు.. మహిళా నేతలకు జనసేనలో గౌరవం లేదు.. పవన్ కళ్యాణ్ కరక్ట్‌గా లేకపోవడంతోనే మహిళలకు జనసేనలో గౌరవం లేదు. ఈ అంశం మీద ఎక్కడైనా డిబేట్ కు రెడీ” అని ఆమె అన్నారు.