ఏపీలో జనసేన పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జి సందీప్ రాయల్‌తో పాటు రాయలసీమ రీజియన్ ఇంఛార్జి పద్మావతి పసుపులేటిలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సజ్జల రామకృష్ణారెడ్డి. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన ఆరోపణలు చేశారు.