Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena First List: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి.. ఓవైపు విపక్షం.. మరోవైపు అధికార కూటమి అభ్యర్థులను ప్రకటిస్తుంది.. ఇప్పటికే కూటమి నుంచి టీడీపీ తొలి అభ్యర్థుల జాబితా విడుదల చేయగా.. ఇప్పుడు కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన కూడా తొలి జాబితాను విడుదల చేసింది.. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలోని అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపారు. తొలి జాబితాలో రెండు కార్పొరేషన్లతో పాటు 12 మున్సిపాలిటీలకు పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.
రెండు కార్పొరేషన్లకు అభ్యర్థులు వీరే
కార్పొరేషన్ల విభాగంలో ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడు, విజయవాడ నుంచి వంగవీటి రాధాకృష్ణను జనసేన పార్టీ ఎంపిక చేసింది. వీరి అభ్యర్థిత్వాలకు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపినట్లు పార్టీ వెల్లడించింది.
Also Read
- AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
- TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
12 మున్సిపాలిటీలకు అభ్యర్థుల ప్రకటన
మున్సిపాలిటీలకు సంబంధించి అమలాపురం నుంచి నల్లా శ్రీధర్, చిలకలూరిపేట నుంచి తోట రాజరాజేశ్వరి, గొల్లప్రోలు నుంచి కడారి తమ్మయ్య నాయుడును జనసేన బరిలోకి దించుతోంది. నరసాపురం నుంచి కొత్తపల్లి శైలజ, నిడదవోలు నుంచి కల్లం జ్యోతి, పెడన నుంచి మట్టా శివపావనిని అభ్యర్థులుగా ఎంపిక చేసింది. అలాగే పిఠాపురం నుంచి డాక్టర్ బీరా విజయ్ శేఖర్, పుత్తూరు నుంచి డి. ఏలుమలై, సాలూరు నుంచి గొర్లె విజయకుమారిని అభ్యర్థులుగా ప్రకటించింది.. సామర్లకోట నుంచి పిట్టా జానకి రామారావు, తెనాలి నుంచి తోటకూర వెంకట రమణారావు, తిరువూరు నుంచి పి. మాధవికి జనసేన పార్టీ అవకాశం కల్పించింది.
తొలి జాబితాలో మొత్తం 14 మంది
జనసేన ప్రకటించిన తొలి జాబితాలో మొత్తం 14 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ఇద్దరు కార్పొరేషన్లకు, 12 మంది మున్సిపాలిటీలకు ప్రాతినిధ్యం వహించనున్నారు. పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆమోదంతో అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రకటించిన ఈ తొలి జాబితాపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాగా, ఇప్పటికే కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తి అయ్యింది.. ఇక, వేర్వేరుగా తమ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి..
జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా
కార్పొరేషన్లు
1.ఏలూరు: శ్రీ రెడ్డి అప్పలనాయుడు
2.విజయవాడ: శ్రీ వంగవీటి రాధాకృష్ణ
మున్సిపాలిటీలు
1. అమలాపురం: శ్రీ నల్లా శ్రీధర్
2. చిలకలూరిపేట: శ్రీమతి తోట రాజరాజేశ్వరి
3. గొల్లప్రోలు: శ్రీ కడారి తమ్మయ్య నాయుడు
4. నరసాపురం: శ్రీమతి కొత్తపల్లి శైలజ
5.నిడదవోలు: శ్రీమతి కల్లం జ్యోతి
6.పెడన: శ్రీమతి మట్టా శివపావని
7.పిఠాపురం: డాక్టర్ బీరా విజయ్ శేఖర్
8.పుత్తూరు: శ్రీ డి. ఏలుమలై
9.సాలూరు: శ్రీమతి గొర్లె విజయకుమారి
10.సామర్లకోట: శ్రీ పిట్టా జానకి రామారావు
11.తెనాలి: శ్రీ తోటకూర వెంకట రమణారావు
12.తిరువూరు: శ్రీమతి పి. మాధవి
తాజావార్తలు
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
-
Janasena First List: 2 కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల జనసేన అభ్యర్థులు ఖరారు.. తొలి జాబితా పూర్తి వివరాలు ఇవే
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Deva : రజనీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ మృతి
-
TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!