రౌడీ షీటర్ల దాడికి గురైన కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబాన్ని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ పరామర్శించారు.. ఐతనగర్ లో చిరంజీవి నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించిన శైలజ.. కానిస్టేబుల్ కుటుంబంతో మాట్లాడి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు..
పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది మహిళా కమిషన్.. దీనిపై 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పవన్ వ్యాఖ్యలు ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలించేలా ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్న కమిషన్.. తాను చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్… ఇటీవల పవన్ కల్యాణ్ వైజాగ్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం.. ఆ తర్వాత ఆంక్షల మధ్య ఆయన వైజాగ్‌ను వీడడం.. జనసేన ప్రధాన కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో.. అధికార పార్టీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో మూడు పెళ్లిళ్ల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు పవన్ .. నేను మూడు సార్లు పెళ్లి చేసుకున్నానని మూడు రాజధానులు పెట్టాలా? మీరు కూడా…