Site icon NTV Telugu

Nadendla Manohar: జనసేన క్రియాశీలక సభ్యుడు ఉగ్రదాడిలో మరణించడం బాధాకరం..

Nadendla Manohar

Nadendla Manohar

ఏలూరు రోడ్డులోని పాత బస్టాండు వద్ద జనసేన సభ్యులు మానవహారం నిర్వహించారు. పహల్గాం మృతులకు సంతాపం తెలుపుతూ నిర్వహించిన మానవహారంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మానవహారం నిర్వహించినట్లు తెలిపారు. జనసేన క్రియాశీలక సభ్యుడు మధుసూధన్ ఉగ్రదాడిలో మరణించడం బాధాకరమన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు అందరం కలిసి ముందుకెళ్ళాలని పిలుపునిచ్చారు. మనదేశం, మనరాష్ట్రం.. ఆ తరువాతే మనందరమన్నారు. సమాజం కోసం, దేశం కోసం మనందరం నిలబడాలని సూచించారు.

READ MORE: Sarangapani Jathakam Review : సారంగపాణి జాతకం రివ్యూ .. ప్రియదర్శి మరో హిట్ కొట్టాడా?

ప్రజలలో చైతన్యం తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తమ వారిని కోల్పోయిన వారికి అండగా నిలబడాలన్నారు. కాగా.. “కశ్మీర్ పర్యటనకి వెళ్ళిన వారిని తీవ్రవాదులు దాడి చేయడం దిగ్భ్రాంతికరం. డిప్యుటీ సీఎం పవన్ ప్రత్యేకంగా కావలి, విశాఖ వెళ్ళి బాధితులను పరామర్శించారు. తీవ్రవాద సంబంధాలు ఏమైనా ఉంటే అధికారులు పూర్తిస్థాయి విచారణ చేస్తారు.” అని ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను వ్యాఖ్యానించారు.

READ MORE: NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ సూత్రధారి అరెస్ట్.. చాలా కాలంగా పరారీలో నిందితుడు..

Exit mobile version