ఏలూరు రోడ్డులోని పాత బస్టాండు వద్ద జనసేన సభ్యులు మానవహారం నిర్వహించారు. పహల్గాం మృతులకు సంతాపం తెలుపుతూ నిర్వహించిన మానవహారంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మానవహారం నిర్వహించినట్లు తెలిపారు. జనసేన క్రియాశీలక సభ్యుడు మధుసూధన్ ఉగ్రదాడిలో మరణించడం బాధాకరమన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు అందరం కలిసి ముందుకెళ్ళాలని పిలుపునిచ్చారు. మనదేశం, మనరాష్ట్రం.. ఆ తరువాతే మనందరమన్నారు. సమాజం కోసం, దేశం కోసం మనందరం నిలబడాలని…