EX MLA Samineni Udayabhanu on Kota Srinivasa Rao: విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈనెల 13న ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించారు. 40 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్ కలిగిన కోట శ్రీనివాసరావును అందరూ గుర్తుచేసుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సినీ రంగానికి…
బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య, పెండెం దొరబాబు.... అందరూ అందరే. అంతా సీనియర్ లీడర్సే. కొందరు రాష్ట్ర స్థాయిలో, కొందరు నియోజకవర్గంలో చక్రాలు తిప్పేసిన వారే. అంతకు ముందు వైసీపీలో ఉన్నప్పుడు వాయిస్ రెయిజ్ చేసిన వారే. కానీ... కాలం మారింది. పరిస్థితులు మారిపోయాయి.... సదరు లీడర్స్ స్వరాలు మూగబోయాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఫుల్ వాల్యూమ్‌లో ఫ్యాన్ కిందినుంచి పక్కకు వచ్చేసి టీ గ్లాస్ పట్టుకున్నారు ఈ నేతలంతా.
ఏలూరు రోడ్డులోని పాత బస్టాండు వద్ద జనసేన సభ్యులు మానవహారం నిర్వహించారు. పహల్గాం మృతులకు సంతాపం తెలుపుతూ నిర్వహించిన మానవహారంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మానవహారం నిర్వహించినట్లు తెలిపారు. జనసేన క్రియాశీలక సభ్యుడు మధుసూధన్ ఉగ్రదాడిలో మరణించడం బాధాకరమన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు అందరం కలిసి ముందుకెళ్ళాలని పిలుపునిచ్చారు. మనదేశం, మనరాష్ట్రం.. ఆ తరువాతే మనందరమన్నారు. సమాజం కోసం, దేశం కోసం మనందరం నిలబడాలని…
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యలు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
JanaSena: ఈ నెల 26వ తేదీన జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు.
వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఉదయభాను పంపారు. తాను వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్నానని.. వైఎస్సార్, జగన్‌కు ముఖ్య అనుచరుడిగా కలిసి నడిచినట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.