Pawan Kalyan: కురుక్షేత్రం అంటే కురుక్షేత్రమే.. వచ్చేది జనసేన-టీడీపీ ప్రభుత్వమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఈ సారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారని.. జగన్ ఓటమి ఖాయమని, మేం అధికారంలోకి రావడం ఖాయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. మెగా డీఎస్సీ కోరుకుంటున్న అందరికీ తాము అండగా ఉంటామన్నారు. 30 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంటున్నారని పవన్ ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం కురుక్షేత్రం జరుగుతోందని.. 100 మందికి పైగా ఉన్నారు కాబట్టి.. వైసీపీ వాళ్లే కౌరవులు అని పవన్ అన్నారు. మెగా డీఎస్సీ అని జగన్ ఇచ్చిన హామీలేమయ్యాయని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సందర్భంగా జనసేనాని హామీ ఇచ్చారు. పోలీసులను అండగా పెట్టుకుని.. కిరాయి సైన్యాన్ని చేతిలో పెట్టుకున్న వైసీపీతో పోరాడుతున్నామని పవన్ అన్నారు.
Also Read: PM Modi: తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి
Also Read
- CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
అధికారం కోసం అర్రులు చాచడం లేదన్న పవన్.. ప్రజల భవిష్యత్తు కోసం పోరాడుతున్నామన్నారు. అనుక్షణం బెదిరింపులు.. యుద్ద రంగం నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులు వస్తున్నాయన్నారు. స్పెషల్ స్టేటస్ కేటగిరి విషయంలో ప్రధానితో విబేధించానని పవన్ చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీని ఎలా తీసుకుంటారని తాను చంద్రబాబుతో విబేధించానన్నారు. ప్రజల కోసం నేను మాటిచ్చాను.. దానికి నిలబడ్డానని పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో ఓట్లు చీలకూడదనే నిర్ణయం తీసుకున్నానన్నారు. తాను అసెంబ్లీలో ఉండి ఉంటే.. మెగా డీఎస్సీ కోసం ఇలా ఆందోళన చేయాల్సి వచ్చేది కాదన్నారు. జగన్‌కు ఐదేళ్ల కాలం ఎంత విలువైందో తెలియదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
ఐదేళ్ల కాలంలో చాలా మంది యువత వయస్సు పెరిగి ఉద్యోగాలకు అర్హత కోల్పోతారని చెప్పుకొచ్చారు. ఓట్లు చీలకుండా ఉండి ఉంటే.. ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. యువతను మోసం చేసిన ప్రభుత్వాన్ని తాను అధికారంలోకి ఉండనివ్వనన్నారు. వచ్చేది జనసేన-టీడీపీ ప్రభుత్వమే అని పవన్ స్పష్టం చేశారు. జగన్ చక్కటి పరిపాలన ఉండుంటే నాలుగో విడత వారాహి యాత్రకు ఇంత స్పందన రాదన్నారు. జగన్ పాలన బాగుండి ఉండుంటే.. నా వారాహి వాహనం రోడ్డేక్కేదే కాదన్నారు.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!