Pawan Kalyan: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్ అంశంలో రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం వాదనలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమే అని, శాశ్వతం కాదని స్పష్టం చేసిన విషయం విదితమే. ఈ చారిత్రాత్మక తీర్పుపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జమ్ము – కశ్మీర్‌ను భారతదేశంలో సంపూర్ణంగా విలీనం చేయాలని కలలుగన్న భారత్ ప్రజలందరికీ.. సుప్రీం తీర్పు మరో విజయమని ఆయన వ్యాఖ్యానించారు. దేశ ప్రజలందరూ సంతోషంగా వేడుకలు జరుపుకొనే మధుర క్షణాలు అంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
Read Also: Deputy CM: కేసీఆర్ ను పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Also Read
భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేస్తూ చేసిన నిర్ణయాన్ని సుప్రీం కోర్టు ఏకగ్రీవంగా సమర్థిస్తూ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామనన్నారు. సుప్రీం తీర్పు ద్వారా ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగపరంగా చెల్లుబాటేనని ధృవీకరించిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ నిర్ణయం దేశ సమగ్ర ఐక్యత, పురోగతికి ఒక ముఖ్యమైన పరిణామమని ఆయన చెప్పుకొచ్చారు. అతి పెద్ద లౌకిక దేశమైన భారత్ సాధించిన విజయమని పవన్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!