MP Uday Srinivas: ‘జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం’.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Uday Srinivas: కాకినాడలో జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన.. జనసేన అధికారంలోకి వచ్చిన రోజే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. కాపు సీఎం అంశాన్ని భావోద్వేగ అంశంగా అభివర్ణించిన ఆయన, వైసీపీ నేతలు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జనసేన కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం కల్పించిందని పేర్కొన్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పార్టీ 48 శాతం సీట్లు కాపులకు కేటాయించిందన్నారు. ప్రస్తుతం జనసేన తరఫున ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు కాపు సామాజిక వర్గానికి చెందినవారేనని చెప్పారు.
అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 12 శాతం సీట్లు మాత్రమే కాపులకు ఇచ్చిందని ఆరోపించారు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్… కాపు సీఎం కావాలనే అంశంపై వైసీపీ కాపు నేతలు మాట్లాడే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేసిన ఆయన, కుల రాజకీయాలకు పాల్పడొద్దని హితవు పలికారు. అయితే, జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కానీ, రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ కులప్రస్తావన కొనసాగుతూనే ఉంది.. పార్టీ అధినేతలు.. ప్రజా ప్రతినిధులు.. నేతలు.. ఇలా ఎవరు మాట్లాడినా.. ఏదో ఒక సమయంలో కులం పేరు.. దాని ప్రస్తావన తేకుండా ముందుకు సాగరు..
Also Read
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్‌గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
తాజావార్తలు
-
Family Vacation: యూరప్‌ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్‌కు బెస్ట్!
-
MP Uday Srinivas: ‘జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం’.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
-
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్‌తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!