IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్‌గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS Krishna Teja: కాకినాడ జిల్లాలోని 61 గ్రామ పంచాయతీల్లో రూ.1.91 కోట్ల ప్రజాధనంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జిల్లా ఇన్చార్జి డీపీవో లక్ష్మణ్‌తో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టెలి కాన్ఫరెన్స్ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలు ప్రభుత్వంపై నమ్మకంతో పన్నులు చెల్లిస్తున్నారని, ఆ నమ్మకాన్ని అధికారులు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, “పబ్లిక్ డబ్బులు ముట్టుకుంటే చేతులు కాలిపోతాయి” అంటూ తీవ్ర హెచ్చరిక చేశారు.
కాకినాడ రూరల్ మండలంలోని రమణయ్యపేట గ్రామ పంచాయతీలో డీజిల్ ఖర్చుల పేరుతో రూ.20 లక్షలు డ్రా చేసిన అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన కమిషనర్ కృష్ణతేజ.. దీనిపై వెంటనే క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అక్రమంగా చెల్లించిన బిల్లులను వెనక్కి రప్పించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే, అక్రమ బిల్లుల ద్వారా నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 61 మంది పంచాయతీ కార్యదర్శులను వెంటనే పిలిపించి పూర్తి నివేదిక సమర్పించాలని జిల్లా అధికారులను కమిషనర్ కృష్ణతేజ ఆదేశించారు. ప్రజాధనాన్ని కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. కమిషనర్ కృష్ణతేజ చేసిన ఈ వ్యాఖ్యలు, అధికారులకు ఇచ్చిన హెచ్చరికలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి.
Also Read
- Jyothula Nehru: ముద్రగడ సంస్మరణ సభకు వెళ్లడంపై స్పందించిన జ్యోతుల నెహ్రూ.. ఆసక్తికర వ్యాఖ్యలు
- Thota Trimurthulu: కాపులు గెలవకపోయినా గెలిపిస్తారు.. తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
- Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!