నేరేడు వగరుగా, పుల్లగా ఉంటుంది.. అయితే ఏడాదికి ఒక్కసారే ఇవి దర్శనం ఇస్తాయి.. అప్పుడే మంచి డిమాండ్ ఉంటుంది.. సమ్మర్ లో మామిడి తో పాటు నేరేడు పండ్లు కూడా ఎక్కువగా కనిపిస్తాయి.. వీటిలో ఎన్నో పోషకాలు ఉండటంతో వీటిని తినడానికి ఇష్ట పడతారు.. మార్కెట్ లో నేరేడు పండ్లు కిలో రూ.200 నుంచి రూ.150 పలుకుతున్నాయి. నేరేడు పంట ద్వారా ఎక్కువ ఆదాయం రావడంతో చాలా మంది రైతులు నేరేడును సాగుచేసేందుకు ముందుకు వస్తున్నారు..
మన తెలుగు రాష్ట్రాల లో ఎక్కువగా అనంతపురం లో సాగు చేస్తున్నారు. ఓ రైతు తన రెండు ఎకరాలలో 100 చెట్లకు రూ. 3 లక్షలు సంపాదిస్తున్నారు.. తూర్పుగోదావరిలోని కడియం గ్రామానికి చెందిన నేరేడు తోటలు నాటేందుకు రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ వారు సహకరించారని చెప్పారు. కడియం నుంచి 160మొక్కలను కొన్నాడు. అవి 2019 నుంచి నేరేడు పళ్ళు కాస్తున్నాయి. 2 ఎకరాల పంటకు అతను 2019లో రూ. 70,వేలు, లక్షరూపాయలు, ఇప్పుడు 2022లో ఎకరాకు రూ.1.40 లక్షలు సంపాదిస్తున్నాడు. అతను సాగు చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వాణిజ్య పంటలకు లేని డిమాండ్ దీనికి ఉందని అక్కడ రైతులు చెబుతున్నారు.. వ్యవసాయ నిపుణుల సలహాలతో ఎరువులు, పురుగు మందుల నిర్వహణలో మెరుగైన మెళకువలు నేర్చుకుని నేరేడు తోటలను లాభసాటిగా మార్చుకోవచ్చని చెబుతున్నారు. కేవలం100 చెట్లు ద్వారా దాదాపు 3 లక్షలు మేర ఆదాయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి నుంచి నేరేడు తోట పుష్పించే దశకు వచ్చింది. పుష్పించే దశ నుంచి ఫలాలు వచ్చే దశ వరకు, ఉత్తమ నిర్వహణ పద్ధతులు అనుసరించడం ద్వారా మరింత దిగుబడి పొందగలుగుతారని అంటున్నారు.. ఇకపోతే ఈ పంటను పండించేందుకు రైతులకు సబ్సిడీ కూడా ఇస్తున్నారు.. ఈ పంట పై ఎటువంటి సందెహాలు ఉన్న దగ్గర లోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించవచ్చు..