Oppo Find X9: Oppo Find X9 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో కొత్త రంగులో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ గత నెల మొదట్లో స్పేస్ బ్లాక్, టైటానియం గ్రే అనే రెండు రంగులలో విడుదల అయింది. తాజాగా కంపెనీ వెల్వెట్ రెడ్ (Velvet Red) కలర్ వేరియంట్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి మద్దతుగా గరిష్టంగా 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వరకు లభిస్తుంది.
Shiva Ashtakam: సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు.. మీకోసం శివాష్టకం ఇదిగో..!
కెమెరా, బ్యాటరీ:
కెమెరా విషయానికి వస్తే Oppo Find X9 వెనుక భాగంలో Hasselblad ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో మూడు 50MP సెన్సార్లు, అదనంగా 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 32MP షూటర్ అమర్చబడింది. ఈ ఫోన్ 7,025mAh సామర్థ్యం గల సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుంది. ఇది 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
స్పెసిఫికేషన్లు:
సాఫ్ట్‌వేర్ పరంగా Oppo Find X9 ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16.0 తో పనిచేస్తుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.59 అంగుళాల (1,256 x 2,760 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లే ఉంది. దీనికి Corning Gorilla Glass 7i రక్షణ కల్పించారు. భద్రత కోసం ఈ స్మార్ట్‌ఫోన్ IP66, IP68, IP69 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌లను కలిగి ఉంది. అలాగే అథెంటికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసౌండ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.
iBomma Ravi: ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ..!
ధర:
Oppo Find X9 కొత్త వెల్వెట్ రెడ్ వేరియంట్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ స్మార్ట్ ఫోన్ రూ. 74,999 ధరగా నిర్ణయించబడింది. ఇది ఇతర రంగుల ధరతో పోల్చితే ఎటువంటి మార్పులు లేవు. ఈ కొత్త రంగు ఆప్షన్ డిసెంబర్ 8 నుండి ఒప్పో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అధీకృత రిటైల్ భాగస్వాముల ద్వారా భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా బ్యాంక్ డిస్కౌంట్‌లను ఉపయోగించడం ద్వారా కస్టమర్‌లు ఈ ఫోన్‌ను రూ. 67,499 తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు.