Lionel Messi: హైదరాబాద్‌లో మెస్సీ పర్యటన.. MCHRDలో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ప్రాక్టీస్‌తో సందడి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lionel Messi: అర్జెంటీనా లెజెండరీ ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానుండగా.. ఈ ప్రత్యేక పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు. మెస్సీ భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వస్తుండగా.. ఆయన సీఎం రేవంత్‌ను ప్రత్యేకంగా కలుసుకునే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. మెస్సీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు హైదరాబాద్ టూర్‌కు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించగా, ఈ పర్యటన పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆవిష్కరించారు. రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతో ‘తెలంగాణ రైజింగ్ 2047’ సంకల్పానికి భాగంగా, మెస్సీని తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్‌గా ఆహ్వానించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ఇదిలా ఉండగా.. మెస్సీతో ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో సీఎం రేవంత్ పాల్గొనే అవకాశముంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. రాత్రి సచివాలయం నుండి నేరుగా MCHRD కు వెళ్లి అక్కడే సుమారు గంటపాటు ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న సీఎం వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెస్సీ హైదరాబాద్ పర్యటనతో నగరం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించనుంది. ముఖ్యంగా మెస్సీతో సీఎం రేవంత్ భేటీ, ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు, బ్రాండ్ అంబాసడర్ ప్రతిపాదన ఇవన్నీ తెలంగాణకు గ్లోబల్ లెవెల్‌లో కొత్త అవకాశాలను తెరుచుకోనున్నాయని అనుకోవచ్చు.
Virat Kohli: నేను ఎప్పుడూ సన్నద్ధతను నమ్మను.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!