Jailer 2 : బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ ఊచకోత.. కానీ ఆ రెండు రికార్డులు మిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం, ఓవర్సీస్తో పాటు కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసింది. అయితే, ఇంతటి భారీ విజయం సాధించినప్పటికీ, రజనీకాంత్ కెరీర్లో మైలురాయిగా నిలవాల్సిన రెండు ప్రతిష్టాత్మక రికార్డులు మాత్రం తృటిలో చేజారిపోయాయి. ముఖ్యంగా సొంత రాష్ట్రం తమిళనాడులో ‘జైలర్ 2’ రెండో స్థానానికే పరిమితం కావడం ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా రజనీకాంత్ సినిమా విడుదలైతే తమిళనాడు బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయం. కానీ ‘జైలర్ 2’ విషయంలో సీన్ రివర్స్ అయింది. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి తమిళనాడులో ఈ సినిమా రూ. 221 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కానీ 2023లో విడుదలైన దళపతి విజయ్ బ్లాక్ బస్టర్ ‘లియో’ తమిళనాడులో సాధించిన రూ. 224 కోట్ల రికార్డును రజనీ చిత్రం అధిగమించలేకపోయింది. కేవలం 3 కోట్ల తేడాతో సొంత గడ్డపై నెంబర్ 1 స్థానాన్ని కోల్పోయి, సెకండ్ ప్లేస్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇటు రజనీ ఫ్యాన్స్, అటు విజయ్ ఫ్యాన్స్ మధ్య ఈ నంబర్ల విషయంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.
Also Read
- Nifty 50: పరుగులు పెడుతున్న నిఫ్టీ 50.. 52 వారాల గరిష్టానికి చేరుతుందా..?
- Hindu Population: హిందూ జనాభాలో అగ్రస్థానం.. ముస్లిం జనాభాలో రెండో స్థానం.. 2070 నాటి ప్రపంచంలో భారత్‌లో పరిస్థితి!
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. వాయిదాల రూపంలో డబ్బుల విత్ డ్రాకు అవకాశం..
- Telangana Inter Exams : తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 24 నుంచి థియరీ పరీక్షలు
తమిళనాడు తర్వాత రజనీకాంత్‌కు అంతటి భారీ మార్కెట్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లోనూ ‘జైలర్ 2’కు ఊహించని షాక్ తగిలింది. విడుదలైన మొదటి వారం నుంచే వసూళ్ల వర్షం కురిపించిన ఈ చిత్రం, తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్మాయి. కానీ, ఫుల్ రన్ ముగిసే సరికి తెలుగు వెర్షన్ రూ. 99.65 కోట్ల గ్రాస్ వద్దే ఆగిపోయింది. కేవలం 35 లక్షల రూపాయల తేడాతో సెంచరీ మార్కును మిస్ చేసుకోవడం డిస్ట్రిబ్యూటర్లను, అభిమానులను కాస్త నిరాశపరిచింది. మొత్తానికి ఓవర్సీస్, పొరుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ‘జైలర్ 2’, తమిళనాడులో విజయ్ ‘లియో’ రికార్డును కొట్టలేకపోవడం, తెలుగులో వంద కోట్ల మైలురాయికి అడుగు దూరంలో నిలిచిపోవడం బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర చర్చకు దారితీసింది.
తాజావార్తలు
-
Jailer 2 : బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ ఊచకోత.. కానీ ఆ రెండు రికార్డులు మిస్
-
Nifty 50: పరుగులు పెడుతున్న నిఫ్టీ 50.. 52 వారాల గరిష్టానికి చేరుతుందా..?
-
Hindu Population: హిందూ జనాభాలో అగ్రస్థానం.. ముస్లిం జనాభాలో రెండో స్థానం.. 2070 నాటి ప్రపంచంలో భారత్‌లో పరిస్థితి!
-
Wedding Business: 25 రోజుల్లో రూ.7.50 లక్షల కోట్ల వ్యాపారం.. పెళ్లిళ్ల జోరు మామూలుగా లేదుగా!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. వాయిదాల రూపంలో డబ్బుల విత్ డ్రాకు అవకాశం..
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!