సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ల కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలో తమన్నా చేసిన ‘కావాలయ్యా’ సాంగ్ ఇండియాను ఎలా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్-2’ కోసం మేకర్స్ అంతకు మించిన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీలో ఒక పవర్ఫుల్ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహిని ఎంపిక చేశారట. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ చెన్నైలో ప్రారంభమైందని, ఒక హై-ఆక్టేన్ డ్యాన్స్ నంబర్‌ను అక్కడ భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. నోరా తన అదిరిపోయే స్టెప్పులతో ఈసారి థియేటర్లను హోరెత్తించడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Hyper Aadi : అక్రమ సంబంధాలకు ఓకే.. పెళ్లికి నో? హైపర్ ఆది కామెంట్స్ వైరల్
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్లో కేవలం నోరా ఫతేహి మాత్రమే కాదు, మరికొందరు దిగ్గజ తారలు కూడా భాగం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌తో పాటు, టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారనే పుకార్లు అంచనాలను పెంచేశాయి. తొలి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ తమ నటనతో మ్యాజిక్ చేయగా, ఈసారి బాలయ్య ఎంట్రీ ఇస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులన్నీ తిరగరాయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని మరింత మాస్ అండ్ స్టైలిష్ ఎలిమెంట్స్‌తో ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో, రజినీకాంత్ ఫ్యాన్స్ ఈ ‘జైలర్-2’ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.