Jagga Reddy: కవిత, బీఎల్ సంతోష్‌లను వెంటనే అరెస్ట్ చేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy: ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారాలు తెలంగాణ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్, ఎమ్మెల్యేలకు ప్రలోభాల కుంభకోణంలో బీజేపీకి చెందిన నేతలు ఉండడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియా సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద స్కాంలు చేశాయని విమర్శించారు. కవిత, బీఎల్ సంతోష్ ఇద్దరూ నేరగాళ్లేనని, వారిద్దరినీ తక్షణమే అరెస్ట్ చేసి, వాస్తవాలు వెలికితీయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. వారిని అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. వారిని అరెస్ట్ చేసేంతవరకు కాంగ్రెస్ పార్టీ మహా ఉద్యమం చేపడుతుందన్నారు. గత నెలరోజులుగా లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులే నడుస్తున్నాయని, ఈ రెండు స్కాంలు నిజమని తేలిందని వెల్లడించారు. కవిత లిక్కర్ కేసులో ఉందని, అరెస్ట్ చేస్తామని బీజేపీ పరోక్షంగా సంకేతాలు ఇచ్చేసిందని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
బీజేపీ నేతలు తామే నీతిమంతులమని, అవినీతి అంటేనే తమకు భయమని అనేక డ్రామాలు ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయని అన్నారు. నాడు యూపీఏ పాలన సందర్భంగా విపక్షంలో ఉన్న బీజేపీ అధికార కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేసిందని, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీఎల్ సంతోష్‌ను కాపాడేందుకు బీజేపీ సర్కారు ప్రయత్నిస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు. ఒకవేళ బీఎల్ సంతోష్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటికొస్తాయని అన్నారు. కాంగ్రెస్ నేతలను కూడా ట్రాప్ చేయాలని బీజేపీ చూస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
మరోవైపు రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైందన్న ఆయన.. 25 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నారని వెల్లడించారు. టీచర్ పోస్టులు ఎక్కువ ఖాళీగా ఉన్నాయని.. పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. 32 వేల టీచర్ పోస్టులు త్వరగా భర్తీ చేయాలన్నారు. 10 వేల మందికి ప్రమోషన్లు ఆగిపోయాయని.. ప్రమోషన్లు ఇస్తే పోస్టుల ఖాళీలు ఏర్పడతాయన్నారు. సీఎం దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. షర్మిల లూజ్ టాక్ చేసిందని.. అంత ఈజీగా వదలనన్నారు. షర్మిల రాయలసీమ వారసురాలని.. తెలంగాణకు కోడలు అని ఆయన అన్నారు. ప్రజల గురించి ఆమె ఒక్కతే మాట్లాడినట్లు బిల్డప్ ఇస్తోందని ఆయన విమర్శించారు. షర్మిల బీజేపీ వదిలిన బాణం అంటూ జగ్గారెడ్డి ఆరోపించారు. షర్మిల వ్యవహారం టీఆర్ఎస్కు కలిసి వచ్చేలా ఉందన్నారు.
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..