NTV Telugu Site icon

Jyothula Chanti Babu: పవన్‌ కల్యాణ్‌ పిలిస్తే వెళ్లా.. ఇక్కడ టీడీపీ-జనసేన కలిసి పనిచేసే పరిస్థితి లేదు

Jyothula Chanti Babu

Jyothula Chanti Babu

Jyothula Chanti Babu: జగ్గంపేట రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌ అవుతున్నాయి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇప్పుడు జనసేన పార్టీకి టచ్‌లోకి వెళ్లారు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో ఆయన రహస్యంగా సమావేశం అయినట్టు వార్తలు వచ్చాయి.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్‌ కష్టమని పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారం ఉందట.. దీంతో.. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. కానీ, జ్యోతుల నెహ్రూ నుంచి వ్యతిరేకత రావడంతో.. టీడీపీ అధిష్టానం జ్యోతుల చంటిబాబు చేరికను హోల్డ్‌లో పెట్టింది.. దీంతో.. జనసేన పార్టీ టచ్‌లోకి వెళ్లారు జగ్గంపేట ఎమ్మెల్యే..

Read Also: Alla Ramakrishna Reddy: ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన.. సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

పవన్‌ కల్యాణ్‌తో సమావేశంపై అనుచరులతో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పిలిచారు.. అందుకే వెళ్లి కలిసినట్టు చెప్పుకొచ్చారు.. ఈ భేటీలో జిల్లా రాజకీయాల గురించి పవన్‌ అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ఇక, జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పనిచేసే పరిస్థితి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. సర్వేల ద్వారా సీటు ఇవ్వడానికి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చేసింది ఏమీ లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అంతా ప్రభుత్వ పరంగా చేసినవేనన్న ఆయన.. జనవరి 1వ తేదీన అనుచరులతో సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు సీటు ఇస్తున్న వారు పనికి వచ్చే వారేనా? అంటూ వైసీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. కాగా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీచేయనున్నాయి.. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి.. అయితే, సీట్లు సర్దుబాటు జరగాల్సి ఉంది.. ఇలాంటి సమయంలో జ్యోతుల చంటిబాబు.. జగ్గంపేటలో టీడీపీ-జనసేన కలిసి పనిచేసే పరిస్థితి లేదని వ్యాఖ్యానించడం చర్చగా మారింది.

Show comments