Jyothula Chanti Babu: పవన్ కల్యాణ్ పిలిస్తే వెళ్లా.. ఇక్కడ టీడీపీ-జనసేన కలిసి పనిచేసే పరిస్థితి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jyothula Chanti Babu: జగ్గంపేట రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇప్పుడు జనసేన పార్టీకి టచ్‌లోకి వెళ్లారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఆయన రహస్యంగా సమావేశం అయినట్టు వార్తలు వచ్చాయి.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ కష్టమని పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారం ఉందట.. దీంతో.. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. కానీ, జ్యోతుల నెహ్రూ నుంచి వ్యతిరేకత రావడంతో.. టీడీపీ అధిష్టానం జ్యోతుల చంటిబాబు చేరికను హోల్డ్‌లో పెట్టింది.. దీంతో.. జనసేన పార్టీ టచ్‌లోకి వెళ్లారు జగ్గంపేట ఎమ్మెల్యే..
Read Also: Alla Ramakrishna Reddy: ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన.. సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
Also Read
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
- West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
పవన్ కల్యాణ్‌తో సమావేశంపై అనుచరులతో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలిచారు.. అందుకే వెళ్లి కలిసినట్టు చెప్పుకొచ్చారు.. ఈ భేటీలో జిల్లా రాజకీయాల గురించి పవన్ అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ఇక, జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పనిచేసే పరిస్థితి లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. సర్వేల ద్వారా సీటు ఇవ్వడానికి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చేసింది ఏమీ లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అంతా ప్రభుత్వ పరంగా చేసినవేనన్న ఆయన.. జనవరి 1వ తేదీన అనుచరులతో సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు సీటు ఇస్తున్న వారు పనికి వచ్చే వారేనా? అంటూ వైసీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. కాగా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీచేయనున్నాయి.. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి.. అయితే, సీట్లు సర్దుబాటు జరగాల్సి ఉంది.. ఇలాంటి సమయంలో జ్యోతుల చంటిబాబు.. జగ్గంపేటలో టీడీపీ-జనసేన కలిసి పనిచేసే పరిస్థితి లేదని వ్యాఖ్యానించడం చర్చగా మారింది.
తాజావార్తలు
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!