చాలా మంది గుడికి వెళితే ప్రశాంతత ఉంటుందని చెబుతారు.. అక్కడ జనాలు ఉన్నా సరే ఆ ప్రాంగణంలోకి కాలు పెట్టగానే తెలియని అనుభూతి కలుగుతుంది. అందుకే వీలు చూసుకొని మరీ చాలా మంది గుడికి వెళ్తుంటారు..అయితే బ్రహ్మదేవుని ఆలయాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయనే సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాష్ట్రంలోని బ్రహ్మ ఆలయానికి వెళ్లడం ద్వారా తలరాతలు మారిపోతాయని పండితులు చెబుతున్నారు.. ఏం కోరుకున్న కూడా వెంటనే జరిగిపోతాయని పండితులు చెబుతున్నారు.. ఆ ఆలయం గురించి మరిన్ని విషయాలు ఇవే..
జగత్పిత బ్రహ్మ మందిర్ అనే పేరుతో ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఈ ఆలయంలో నాలుగు ముఖాల బ్రహ్మను దర్శించుకోవచ్చు. ఈ ఆలయం 2000 సంవత్సరాల కంటే పురాతనమైన ఆలయం కాగా కార్తీక పూర్ణిమ రోజున ఈ గుడిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది.. జీవితంలో ఒక్కసారైనా ఈ గుడిని సందర్శించాలని నిపుణులు చెబుతున్నారు.. బ్రహ్మదేవుడు తన ఆయుధమైన తామరపువ్వుతో వజ్రనప అనే రాక్షసుడిని సంహరించగా మూడు ప్రదేశాలలో తామర రేకులు పడడం వల్ల మూడు సరస్సులు ఏర్పడ్డాయట. ఆ సమయంలో బ్రహ్మ దేవుడు ప్రధాన పుష్కర్ సరస్సు దగ్గర యజ్ఞం చేసి యజ్ఞం కోసం చుట్టూ కొండలను సృష్టించడం జరిగింది…
ఇకపోతే ఈ ఆలయంలోకి పెళ్ళైన వాళ్లు ప్రవేశించడానికి వీలులేదని పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 1 : 30 నుండి 3 : 00 గంటల మధ్య ఈ ఆలయాన్ని మూసివేస్తారు. బస్సు, రైలు మార్గాల ద్వారా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆలయంలోని గోడలకు వెండి నాణేలు అంటించి ఉంటాయి. అజ్మీర్ జిల్లాలో సముద్రమట్టానికి 510 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి బ్రహ్మదేవుడు ఇక్కడ 60,000 సంవత్సరాల పాటు యజ్ఞం చేసాడని చరిత్ర చెబుతుంది.. భారత దేశంలో ఉన్న అన్ని దేవాలయాల్లో ఈ దేవాలయం చాలా పవిత్ర మైనదిగా పండితులు చెబుతున్నారు..