టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు ‘వారాహి స్టూడియోస్’పై ప్రశంసలు కురిపించారు. మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ కుమార్ తనకు బాగా కావాల్సిన వాడు అని తెలిపారు. మొదటిసారి వారాహి స్టూడియోస్‌లో తాను డబ్బింగ్ చెప్పానని, చాలా బాగా అనిపించిందన్నారు. వసంత్ దగ్గరుండి మరీ తనకు డబ్బింగ్, డైలాగ్స్ చెప్పించాడని చెప్పారు. ఇక్కడికి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, వారాహి స్టూడియోస్ అధినేత వసంత్‌కు ఆల్ ది బెస్ట్ అని జగపతి బాబు పేర్కొన్నారు.
ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించిన వసంత్ కుమార్.. తాజాగా డబ్బింగ్ అండ్ రికార్డింగ్ కోసం వారాహి స్టూడియోస్ స్థాపించారు. 5.1 సరౌండ్ సౌండ్, 7.1.4 హోమ్ అట్మాస్ సామర్థ్యాలతో అమర్చబడి.. థియేట్రికల్ అండ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రమాణాలకు అనుగుణంగా ఆడియో అనుభవాన్ని వారాహి స్టూడియోస్ అందిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ .. భారతీయ, అంతర్జాతీయ చిత్రాలకు కూడా సేవలు అందిస్తోంది. ప్రీమియం పోస్ట్-ప్రొడక్షన్, డబ్బింగ్ సేవలను తక్కువ బడ్జెట్లో వారాహి స్టూడియోస్ అందిస్తోంది.
Also Read: Palla Srinivas: వైఎస్ జగన్ వల్లే ప్రాణ హాని.. బొత్సకు పల్లా కౌంటర్!
కార్తికేయ 2, మహారాజా, మిరాయ్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల పోస్ట్-ప్రొడక్షన్, డబ్బింగ్ వారాహి స్టూడియోస్‌లోనే జరిగింది. ఈ సినిమాలు వారాహి స్టూడియోస్‌కు ఉన్న అంకితభావం, నిబద్దతను తెలియజేస్తుంది. వారాహి సభ్యులు కేవలం సాంకేతిక నిపుణులే కాదు.. సహకారం కూడా అందిస్తారు. సినిమా కథ, ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా వర్క్ ఉంటుంది. అందుకే దర్శక-నిర్మాతలు మరలా మరలా వారాహి స్టూడియోస్‌కు వెళ్తున్నారు.