Jagananna Mana Bhavishyath: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్నే మా భవిష్యత్తు పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం సాగుతోంది. వైఎస్సార్సీపీ మెగా ఉద్యమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. క్షేత్రస్థాయిలో ఈ ఉద్యమానికి ఊహించని విధంగా మద్దతు లభిస్తోంది. రోజురోజుకీ మరింత విస్తృతంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, వైసీపీ శ్రేణులు ప్రజలతో మమేకం అవుతున్నారు.. నాలుగో రోజు అనగా ఈ నెల 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల ఇళ్లలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా పీపుల్స్ సర్వే నిర్వహించారు.. ఇక, పార్టీ ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్ 82960 82960కు 10వ తేదీన 28 లక్షల మిస్డ్ కాల్స్ వచ్చాయి.. ఇక, ఐదో రోజు.. అంటే ఈ నెల 11వ తేదీకి వచ్చేసరికి ఆ సంఖ్య మరింత పెరిగింది.. ఏకంగా 45 లక్షల ఇళ్లలో సర్వే నిర్వహించాయి వైసీపీ శ్రేణులు.. నిన్న మొత్తంగా 37 లక్షల మిస్డ్ కాల్స్ వచ్చినట్టు వైఎస్‌ఆర్సీపీ ప్రకటించింది..
కాగా, వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేస్తున్న మేలును వివరించి.. ప్రతిపక్షాలు సాగిస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైయస్ఆర్ సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని వైసీపీ నేతలు ఆనందపడుతున్నారు. ఏ ఇంటికి వెళ్లినా ఆత్మీయ పలకరింపులు, ప్రభుత్వ పనితీరుపై ఎవరిని కదిపినా హర్షాతిరేకాలు.. మళ్లీ జగనన్నే సీఎం కావాలన్నది తమ ఆకాంక్ష అంటున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇంటి తలుపు, మొబైల్ ఫోన్‌కు వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్‌లను ఇష్టంగా అతికించుకున్నారు.82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెలిపారు. ఆ వెంటనే ఐవీఆర్‌ఎస్ కాల్ ద్వారా సీఎం వైయస్ జగన్ సందేశం రావడంతో ఆనందపడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షల్లో మిస్ట్ కాల్స్ వచ్చాయంటే స్పందన ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అని పార్టీ నేతలు చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ఇదే సందడి కనిపించింది. తమ బాగోగులు కనుక్కోవడానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు, గృహ సారథులు, కన్వీనర్లు, వలంటీర్లకు ప్రజలు సాదర స్వాగతం పలికారు. దాదాపు నాలుగేళ్లుగా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం తమ వెంటే ఉందని, తమ బాగోగులు చూసుకుంటోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి బుక్ లెట్, స్టికర్ అందించి సీఎం వైయస్ జగన్ స్టిక్కర్లను ఇళ్ల కు అంటించిన గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రజలతో మమేకం అవుతున్నారు. మేనిఫెస్టోలోని హామీలను కూడా జగన్ అమలుచేస్తున్నారని అవ్వాతాత, ముసలీ ముతకా, యువత, అన్నివర్గాలు తమ మద్దతు తెలుపుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ… కడప నుంచి కర్నూలు వరకూ ప్రతి నోట ఒకటే మాట. జగనే మా బాట అంటూ నినదిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు తెలియజేస్తూ, ప్రతి కుటుంబం అనుమతితో మా నమ్మకం నీవే జగనన్న స్టిక్కర్ను అతికించుకుంటూ కొనసాగుతున్న కార్యక్రమం మా నమ్మకం నువ్వే జగనన్న. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతున్నారని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు.