Nakka Anand Babu: మీ హయాంలో.. మాస్క్ అడిగినందుకు డాక్టర్‌ను నడిరోడ్డుపై దాడి చేసి చంపారు..
- గంజాయి అమ్మడం, ఆడపిల్లలను వేధించడం నేరం కాదన్నట్లు మాట్లాడారు
- ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ప్రజలంటే జగన్ కి కోపం
- గతంలో మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టారన్నారు
- ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యులు, నక్కా ఆనంద్ బాబు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గంజాయి వ్యాపారులు, డ్రగ్ డీలర్లు, బ్లేడ్ బ్యాచ్‌లకు జగన్‌ను గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందేమో అని పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు. గంజాయి అమ్మడం, ఆడపిల్లలను వేధించడం నేరం కాదన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయన్నారు. తాజాగా జగన్ వ్యాఖ్యలపై స్పందించారు. గతంలో మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టారన్నారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ప్రజలంటే జగన్ కి కోపం రోజురోజుకూ పెరిగిపోతోందని ఆరోపించారు. ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన అసహ్యం కలుగుతోందని విమర్శించారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి రౌడీ షీటర్లు, చైన్ స్నాచర్లు, బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి వ్యాపారులకు మద్దతు ఇవ్వడం ఏమిటి? సభ్య సమాజం ఏమనుకుంటుందనే కనీస ఆలోచన జగన్‌కు లేదని మండిపడ్డారు. సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? అని ప్రశ్నించారు.
READ MORE: Covid-19 Cases: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..! ఆ రాష్ట్రంలోనే ఎక్కువ రోగులు..
Also Read
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
జగన్‌కు రాజకీయ భవిష్యత్తు లేదని.. ప్రజాసేవకు పనికిరాడని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. “గంజాయి, డ్రగ్ వ్యాపారులు, బ్లేడ్ బ్యాచ్‌లకు గౌరవ అధ్యక్షుడిగా జగన్‌ను నియమిస్తే సరిపోతుంది. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగింది. జగన్ సహచరులు, అనుచరులు, బంధువులు, మిత్రులు రాష్ట్రాన్ని దోచేశారు. కొందరు జైళ్లకు వెళ్తున్నారు. ఈ నేరాలకు సంబంధించిన ఆధారాలు అన్ని తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. తన పాలనలో జరిగిన నేరాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు జగన్ చౌకబారు ఎత్తుగడలు వేస్తున్నారు. పోలీసులపై హత్యాయత్నం చేస్తే వారిని సమర్థించారు. తెనాలిలో పోలీసులు వల్ల పెద్ద నేరం జరిగినట్లు మాట్లాడి, రౌడీలను పొగడడం జగన్‌కు సంస్కారం లేని తనాన్ని చూపిస్తుంది. గంజాయి విక్రయం, ఆడపిల్లల వేధింపు నేరాలు కాదన్నట్లు ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. చీరాలలో కిరణ్ కుమార్ అనే వ్యక్తిని మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపారు. డాక్టర్ సుధాకర్‌ను మాస్క్ అడిగినందుకు నడిరోడ్డుపై దాడి చేసి చంపారు. గురజాలకు చెందిన దోమతోటి విక్రమ్‌ను హైదరాబాద్ నుంచి పిలిపించి వైసీపీ గూండాలు హత్య చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుని పోలీసులు కిరాతకంగా వేధించారు. ఇసుక దందా గురించి ప్రశ్నించిన వరప్రసాద్‌ను పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేసి అవమానించారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసి, శవాన్ని డోర్ డెలివరీ చేశారు, కేసు పట్టించుకోలేదు. ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడం, ఆడపిల్లల రక్షణ, గంజాయి నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే, జగన్ ఈ ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. గతంలో మతాల మధ్య, ఇప్పుడు కులాల మధ్య విభేదాలు రెచ్చగొడుతున్నారు. విజయసాయి రెడ్డి వంటి పాత ముద్దాయిలు పక్కకు వెళ్లిపోయారు, కొత్త వారిని చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కుట్రలు, కుయుక్తులతో ప్రజలను మభ్యపెడుతున్నారు.” అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!