తెలంగాణ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో బుధవారం హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన మూడు రోజుల ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌పో-2023ను ఇంధన శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ దేశంలోనే అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సారథ్యంలో రాష్ట్రం కేవలం తొమ్మిదేళ్లలో 90 ఏళ్లుగా అభివృద్ధి చెందిందని ఆయన దార్శనికతనే ఇందుకు కారణమన్నారు.
Also Read : Balakrishna: దటీజ్ బాలయ్య.. జగపతిబాబు కోసం వెంటనే ఒప్పేసుకున్నాడట!
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో పారిశ్రామిక రంగంలో తెలంగాణ అసాధారణ ప్రగతి సాధించదని, టి హబ్, వీ హబ్, టిఎస్ఐసి, టిఎస్-ఐపాస్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాయని ఆయన అన్నారు. హైదరాబాద్ లోనే కాకుండా జిల్లా కేంద్రాల్లో కూడా ఎగ్జిబిషన్లు నిర్వహించాలని ఎఫ్ టీసీసీఐకి మంత్రి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పాలు, చేపలు, ఇతర వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల ఉత్పత్తిలో పారిశ్రామికవేత్తలకు అవకాశం ఉందన్నారు.
Also Read : Age System: సౌత్ కొరియన్లు మరింత యవ్వనంగా మారబోతున్నారు.. కారణం ఏంటో తెలుసా..?
ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్తలు వినూత్నంగా రూపొందించిన ఉత్పత్తుల ప్రదర్శనశాలను మంత్రి సందర్శించారు. కార్యక్రమంలో పారిశ్రామిక వేత్తలు మీలా జయదేవ్, తారా సత్యవతి, విష్ణువర్ధన్ రెడ్డి, అనిల్ అగర్వాల్, శ్రీనివాస్ మహంకాళి, సురేష్ కుమార్ సింఘాల్, పాస్ పోర్ట్ అధికారి బాలయ్య పాల్గొన్నారు.